
మలబద్ధకం అనేది కడుపునకు సంబంధించిన వ్యాధి. దీని వల్ల మీ శరీరం పూర్తిగా శుభ్రంగా ఉండదు. నిర్జలీకరణం, ఇతర కారణాల వల్ల చాలా మంది తరచుగా మలబద్దకానికి గురవుతారు. ఎప్పుడూ మలబద్దకం సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చే వారు కూడా చాలా మందే ఉంటారు. కానీ పొట్టను పూర్తిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఎన్నో వ్యాధులు వస్తాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తే పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్ధకం కారణంగా పొట్ట పూర్తిగా శుభ్రపడదు. దీనివల్ల చాలాసార్లు నోటిలో అల్సర్ల సమస్య ఉంటుంది.
అత్తి పండ్లు, పాలు
ఒక గ్లాసు పాలలో నాలుగు అంజీర్ పండ్ల ముక్కలను వేయండి. ఆ తర్వాత పాలను మరిగించండి. పాలు చల్లారిన తర్వాత తాగి అంజీర పండ్లను నమిలి తినండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది.
ఆమ్లా జ్యూస్
ఉదర సంబంధ సమస్యలకు ఉసిరి రసం దివ్యౌషధం. గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ రసాన్ని నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగితే జీర్ణ సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం తొలగిపోతాయి.
పెరుగు, అవిసె గింజలు
ప్రోబయోటిక్స్, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్న పెరుగు జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవిసె గింజల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలో సులభంగా కరిగి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
జీలకర్ర నీరు
జీలకర్రను రోజూ మరిగించి రోజుకు రెండు సార్లు ఒక గ్లాసు నీళ్లు తాగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. రుచి బాగుండేందుకు దీనికి నల్ల ఉప్పును కూడా కలపొచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే జీలకర్రను తీసుకోవడం వల్ల మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుందని ఎన్సీబీఐ తెలిపింది.
క్రమం తప్పకుండా యోగా
మీరు మలబద్దకంతో బాధపడుతుంటే ప్రతిరోజూ యోగాను చేయండి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే మయూరాసనం చేయండి. ఇది జీర్ణ సమస్యలను తొలగించి పేగులను బలోపేతం చేస్తుంది. పవనముక్తాసనం చేయడం ద్వారా ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది. అలాగే కడుపులో పేరుకుపోయిన గ్యాస్ సులభంగా విడుదలవుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది.