బ్రెస్ట్ మసాజ్ తల్లిపాలను పెంచుతుందా?

Published : Apr 10, 2023, 04:15 PM IST
బ్రెస్ట్ మసాజ్ తల్లిపాలను పెంచుతుందా?

సారాంశం

మీ బిడ్డ రోజుకు ఏడెనిమిది సార్లు మూత్ర విసర్జన చేయకపోతే.. మీ బిడ్డకు తగినన్ని పోషకాలు అందడం లేదని అర్థం. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే రొమ్ముల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.   

నవజాత శిశువుకు తల్లి పాలే పూర్తి ఆహారం. అందుకే బిడ్డకు పాలను పుష్కలంగా అందేలా చూడాలి. తల్లిపాలు బిడ్డ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటుగా వారిని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి.  ఇందుకోసం తల్లి మంచి పోషకాహారం తీసుకోవాలి. తల్లి ఆహారపు అలవాట్లు పిల్లలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఆహారం ఎంత పోషకంగా ఉంటే తల్లిపాలు అంత పోషకమైనవిగా ఉంటాయి. కానీ చాలాసార్లు తల్లి వక్షోజాలు బిడ్డ కడుపు నింపడానికి తగినన్ని పాలను ఉత్పత్తి చేయవు. తల్లిపాలు ఇచ్చినా కొంతమంది పిల్లలు బలహీనంగా ఉంటారు. 

తల్లి పాలలో అన్ని పోషకాలు ఉండటం చాలా ముఖ్యం. ఇవే మీ బిడ్డను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే తల్లులు మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల తల్లిపాల నుంచి కొవ్వు కంటెంట్ తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు తగినంత బరువు పెరగరు. అందుకే తల్లులు బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో బీ బిడ్డ బరువు కూడా బాగుంటుంది.  తల్లిపాలలో కొవ్వుతో పాటుగా ఇతర పోషకాలను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

నిపుణుల ప్రకారం.. శిశువు ఆరోగ్యంగా ఎదిగేందుకు తల్లిపాలు చాలా ముఖ్యం. తల్లిపాలు శిశువు ఎముకలను బలోపేతం చేయడమే కాదు.. వారి శరీరం మొత్తాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి. పుట్టిన 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతే ఘనాహారం పెట్టాలి. లేదా తల్లి పాలకు బదులు బాటిల్ పాలను తాగించాలి. 

తల్లి పాలలో సంతృప్త కొవ్వు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మోనోశాచురేటెడ్ ఫ్యాట్, పాలీఅన్శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఈ పాలను తాగడం వల్ల బిడ్డకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. 100 గ్రాముల తల్లి పాలలో 75 కిలో కేలరీల శక్తి, 4.2 కొవ్వు గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది నవజాత శిశువుకు చాలా అవసరం. 

నవజాత శిశువుకు తల్లి పాలే పూర్తి ఆహారం. తల్లిపాలు బిడ్డకు పుష్కలంగా పోషణను అందిస్తున్నాయో? లేదో? అనే విషయాన్ని శిశువు మూత్రం ద్వారా తెలుసుకోవచ్చు. మీ బిడ్డకు అన్ని పోషకాలు పుష్కలంగా అందితే వారు పదేపదే మూత్ర విసర్జన చేస్తారు. అంటే పోషకాలు పుష్కలంగా అందే పిల్లలు రోజుకు ఏడు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేస్తారు. 

తల్లిపాలలో పోషకాలను ఎలా పెంచాలి?

రెండు రొమ్ముల పాలు తాగేలా చూడాలి

బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు.. బిడ్డ రెండు రొమ్ముల నుంచి పాలు తాగేలా చూడాలి. ఒకే రొమ్ము పాలను తాగితే ఇంకో రొమ్ము అలాగే ఉంటుంది. అయితే మొదటగా తాగిన పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. దీని వల్ల పిల్లలకు కావాల్సినంత కొవ్వు లభించదు. అందుకే మీ పిల్లలు రెండు రొమ్ముల పాలను తాగకపోతే బ్రెస్ట్ పంప్ తో మీరు పాలను బయటకు తీసి రొమ్మును ఖాళీ చేయండి. 

రొమ్ము మసాజ్ లు

పాలు ఇచ్చేముందు మీ రెండు రొమ్ములను మసాజ్ చేయండి. బ్రెస్ట్ మసాజ్ వల్ల బ్రెస్ట్ మిల్క్ లో కొవ్వు పెరుగుతుంది. అలాగే మీ బేబీకి పుష్కలంగా పోషకాలు అందుతాయి. అలాగే మీ రొమ్ములు కూడా ఖాళీ అవుతాయి. దీంతో వాటిలో కొవ్వు కూడా మెరుగుపడుతుంది.

పౌష్టికాహారం 

పాలిచ్చే మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి. పాలీఅన్శాచురేటెడ్, మోనోశాచురేటెడ్ ఫ్యాట్ యాసిడ్లు ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇది పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇందుకోసం ఆకుకూరలు, గుడ్లు, తృణధాన్యాలు, సోయాబీన్ తో సహా పండ్లను పుష్కలంగా తినాలి.

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం