హై బీపీని తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీ కోసం..!

By Mahesh RajamoniFirst Published Mar 18, 2023, 1:02 PM IST
Highlights

రక్తపోటు పెరగడానికి కారణాలెన్నో ఉన్నాయి. ఏదేమైనా అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాల్ని పెంచుతాయి. అందుకే రక్తపోటును నియంత్రణలోనే ఉంచుకోవాలి. 
 

అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం, స్మోకింగ్, ఒత్తిడికి ఎక్కువగా గురికావడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినడం, ఎక్కువసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, జన్యుపరమైన కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొంతమందికి వారి రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు అవసరం కావొచ్చు. చాలా మంది ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా దానిని తగ్గించొచ్చు. బరువును తగ్గడం, నిర్దిష్ట విటమిన్లు, ఖనిజాలను తీసుకోవడం, సరైన ఒత్తిడి నిర్వహణ రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అధిక రక్తపోటును కంట్రోల్ లో ఉంచడానికి ఎలాంటి  ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

  • ఒకవేళ మీరు అధిక బరువు ఉంటే.. బరువు తగ్గడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అధిక బరువు రక్తపోటును పెంచుతుంది.  అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి. అందుకే బరువును తగ్గండి. బరువు తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఎన్నో ప్రాణాంతక రోగాల ముప్పు కూడా తప్పుతుంది. 
  • ధూమపానం అలవాటుంటే వెంటనే మానేయండి. ఎందుకంటే ఇది కూడా మీ రక్తపోటును పెంచుతుంది. స్మోకింగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
  • అధిక రక్తపోటు ఉన్నవారికి నడక ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ ఒక అర్థగంట పాటు నడిచినా రక్తపోటు అదుపులో ఉంటుంది. నడక బరువు తగ్గడానికి, మీరు ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. 
  • వారానికి రెండు మూడు సార్లు చేపలు తినడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి తగ్గితే ఆటోమెటిక్ గా మీ రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి. 
  • అధిక రక్తపోటు పేషెంట్లు వీలైనంత ఎక్కువగా వెజిటేబుల్ జ్యూస్ ను తాగాలి. ముఖ్యంగా వీట్ గ్రాస్ రసం. ఇది వీరి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. 
  • వెల్లుల్లి కూడా రక్తపోటును తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని తినాలి.
  • ప్రతిరోజూ సెలెరీ తాజా కాండాలను తిన్నా ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది వెయిట్ లాస్ కు కూడా సహాయపడుతుంది. 
  • అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ఎల్-థియనిన్ తో పాటుగా మెగ్నీషియం సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఇవి మీ రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. 
click me!