పడుకునే ముందు ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

Published : Mar 05, 2023, 04:33 PM IST
పడుకునే ముందు ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి

సారాంశం

రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి, ఉదయం బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.   

రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడాన్నే డయాబెటిస్ అంటారు. దీన్ని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కోలుకోలేని ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి. ప్రస్తుతం ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ చరిత్ర వంటి వివిధ కారణాల వల్ల పెద్దలు మాత్రమే కాకుండా యువకులు, చిన్న పిల్లలు కూడా ఈ డయాబెటీస్ వ్యాధి బారిన పడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. డయాబెటిస్ శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీస్తుంది. దీనిని సరైన సమయంలో నియంత్రించకపోతే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు కూడా గురవుతారు.

మీకు ప్రీడయాబెటిస్ ఉంటే కొన్ని జీవనశైలి మార్పులతో ఈ వ్యాధి ప్రారంభాన్ని ఆపొచ్చు లేదా ఆలస్యం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని జీవనశైలి అలవాట్లతో మీ నరాలు, మూత్రపిండాలు, గుండె దెబ్బతినడం వంటి డయాబెటిస్ తో సంబంధం ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్యలను నివారించొచ్చు. అయితే డయాబెటీస్ పేషెంట్ రక్తంలో రాత్రి పూట గ్లూకోజ్ లెవెల్స్ ను నియంత్రించేందుకు, ఉదయం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి  కొన్ని చిట్కాలు బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

చామంతి టీ (1 కప్పు) 

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి కప్పు చామంతి టీ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో బలమైన ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర పెరిగిపోకుండా కాపాడుతాయి. 

నానబెట్టిన బాదం 

నానబెట్టిన బాదం పప్పుల్లో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే రాత్రిళ్లు మీకు ఆకలి కావడాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు రాత్రిపూట చక్కెర కోరికలను బాగా తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

1 టీస్పూన్ నానబెట్టిన మెంతులు
 
మెంతులు మన  ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. మెంతుల్లోని అద్భుతమైన హైపోగ్లైసీమిక్ గుణం శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. 

వజ్రాసనంలో 15 నిమిషాలు కూర్చోండి

కొన్ని యోగాసనాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. రెగ్యులర్ గా 15 నిమిషాల వజ్రాసనంలో కూర్చుంటే మీ రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రణలో ఉంటాయి. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

PREV
click me!

Recommended Stories

Health Tips: ఒంటరిగా ఉండటం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? నిపుణుల మాట ఇదే!
కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్