ఇలాంటి ఫుడ్ తినేవారికి కరోనా రావడం ఖాయం..!

By telugu news teamFirst Published Apr 14, 2021, 11:33 AM IST
Highlights

సరైన ఆహార నియమాలు పాటించేవారికి కరోనా దూరంగానే ఉంటుందట. ఒకవేళ వారికి కరోనా సోకినా.. వెంటనే తగ్గిపోతుందని చెబుతున్నారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇటీవల మొదలైన సెకండ్ వేవ్ మరింత భయంకరంగా వ్యాపిస్తోంది. మొదటిసారి కన్నా రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కరోనా కేసులు ఇంతలా నమోదవ్వడం అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది.

అయితే.. మనం తీసుకునే ఆహారపు అలవాట్లే వీటన్నింటికీ కారణమని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన ఆహార నియమాలు పాటించేవారికి కరోనా దూరంగానే ఉంటుందట. ఒకవేళ వారికి కరోనా సోకినా.. వెంటనే తగ్గిపోతుందని చెబుతున్నారు. అలా కాకుండా.. మంచి ఆహార నియమాలు పాటించని వారి మీద మాత్రం కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ఈ కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలి అంటే.. ముందు అసలు మనం ఎలాంటి చెత్త ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలో ఓసారి చూసేద్దాం..

సరైన ఆహార నియమాలు పాటించని కారణంగా ప్రతి సంవత్సరం 10,200 మంది ప్రాణాలు కోల్పోతున్నారట. అంటే.. ప్రతి 52 నిమిషాలకొకరు చనిపోతున్నారు.మంచి ఆహార నియమాలు పాటించకుండా ఎప్పుడూ జంక్ ఫుడ్ తినే వారిలో మానసిక సమస్యలతోపాటు.. అధిక మరణాల రేటు కూడా నమోదౌతుంది.

కొందరు ఆకలిగా లేకున్నా తినడం లాంటివి చేస్తుంటారు. ఇలా అస్తవ్యస్తంగా తినడం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఈటింగ్ డిజార్డర్స్ లో ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 700 మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఒత్తిడి, మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులు తినే ప్రవర్తనలో మార్పులు వంటి అంశాలపై ప్రధానంగా వీరు పరిశోధన చేశారు. అధ్యయనం పాల్గొన్న వారిలో  సుమారు 8 శాతం మంది అనారోగ్యకరమైన బరువు కలిగి ఉండగా.., 53 శాతం మంది తక్కువ అనారోగ్యకరమైన బరువు కలిగి ఉన్నారు.14 శాతం మంది అతిగా తినడం అలవాటు ఉన్నవారిగా గుర్తించారు. సరైన ఆహారపు అలవాట్లు లేనివారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నట్లు గుర్తించారు. 

click me!