ఆ సమస్యకి వ్యాయామమే పరిష్కారం.. డబ్ల్యూహెచ్ఓ

By telugu news teamFirst Published Nov 26, 2020, 10:20 AM IST
Highlights

వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండకపోతే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని రూడిగెర్ క్రెచ్ చెప్పారు.కరోనా లాక్ డౌన్‌లు, జిమ్ మూసివేతలు, ఆంక్షల వల్ల వ్యాయామ దినచర్యలకు అంతరాయం కలిగింది. 
 

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ప్రజలు చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనాని జయించిన తర్వాత  కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య కొంతకాలం పీడిస్తోంది. అయితే.. ఈ ఆరోగ్య సమస్య మాత్రమే కాకుండా.. మానసిక సమస్యలు కూడా మోదలౌతున్నాయని నిపుణులు  చెబుతున్నారు.

ఈ క్రమంలో.. మానసిక ఆరోగ్యాన్ని జయించడానికి వ్యాయామం ఎంతో అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో కోరింది. మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ విజ్ఞప్తి చేస్తుందని ప్రపంచఆరోగ్య సంస్థ ఏజెన్సీ హెల్త్ ప్రమోషన్ హెడ్ రూడిగెర్ క్రెచ్ విలేకరులతో చెప్పారు.

వ్యాయామం చేస్తూ చురుకుగా ఉండకపోతే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని రూడిగెర్ క్రెచ్ చెప్పారు.కరోనా లాక్ డౌన్‌లు, జిమ్ మూసివేతలు, ఆంక్షల వల్ల వ్యాయామ దినచర్యలకు అంతరాయం కలిగింది. 

దీనివల్ల యువకులు, పెద్దలు చురుకుగా లేరని తేలింది. శారీరకంగా చురుకుగా ఉండకపోతే అనారోగ్యం వాటిల్లుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. గుండె జబ్బులు, టైప్ -2 డయాబెటిస్, కేన్సర్‌ను నివారించడానికి క్రమం తప్పకుండా శారీరక శ్రమ కీలకమని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. శారీరక శ్రమ వల్ల నిరాశ, ఆందోళన తగ్గించడంతోపాటు జ్ఞాపకశక్తిని మెరుగుపర్చి, మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుందని తేలింది.

click me!