చలికాలంలో ఉసిరి.. ఎన్ని ప్రయోజనాలో..!

By telugu news teamFirst Published Dec 4, 2020, 2:18 PM IST
Highlights

ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలం వచ్చిందటే చాలు ఎన్నో ఆరోగ్య సమస్యలను వెంట తీసుకువస్తుంది. జలుబు, తుమ్ము, దగ్గు, జ్వరం లాంటివి పిలవకుండానే వచ్చేస్తాయి. అయితే.. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ఉసిరి  ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఉసిరికాయలను చలికాలంలో నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నారింజ, నిమ్మ, దానిమ్మ కాయలకన్నా…ఉసిరికాయల్లో సీ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది. సో…నిమ్మ తింటే జబులు చేస్తుందనుకుంటే…అలా ఓ ఉసిరికాయను నోట్లో వేసుకోవచ్చు. విటమిన్‌ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా చూస్తుంది.

ఇక చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ మందగిస్తుంది. మలబద్దకం వస్తుంది. అలాంటప్పుడు ఉసిరికాయ జ్యూస్ తాగితే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. డయాబెటిస్‌ ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావల్సినంత క్రోమియం లభిస్తుంది.

 దీంతో ఇన్సులిన్‌ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయి. శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు తగ్గాలంటే ఉసిరికాయ రసాన్ని నిత్యం వాడాలి. దీంతో వెంట్రుకల సమస్యలు కూడా తగ్గుతాయి.

click me!