చొక్కా పట్టి లాగి చెప్పులతో మహిళల దాడి... కారంపొడి చల్లి..: దాడిపై వైసిపి ఎంపీ వివరణ

By Arun Kumar P  |  First Published Feb 24, 2020, 3:56 PM IST

తనపై ఆదివారం కొందరు మహిళలు దాడికి ప్రయత్నించారని వైసిపి ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. తమను పరుష  పదజాలంతో దూషించడమే కాదు కారం పొడి చల్లి దాడికి ప్రయత్నించారని తెలిపారు. 


గుంటూరు: అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక వైసిపి ఎంపీ నందిగం సురేష్ తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు మహిళలు ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఎంపీ జై అమరావతి అనేందుకు నిరాకరించడంతో అమరావతి మహిళా జేఎసీ సభ్యులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎంపీ చొక్కాను పట్టుకొని దాడి చేసేందుకు జేఎసీ నేతలు ప్రయత్నించినట్టుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అసలు ఏం జరిగిందో ఎంపీ నందిగం సురేష్ తాజాగా మీడియాకు వివరించారు. 

''నేను కారులో అమరావతికి వెళ్తుండగా నా వెహికల్ వల్ల ఓ వ్యక్తికి చిన్న దెబ్బ తగిల్తే ఆయనను హాస్పిటల్ లో చూపమని మా పార్టీ నాయకులకు చెప్పాం. అయితే వారు కూడా అదేముందిలే సార్ కావాలని చేసింది కాదు యాక్సిడెంటల్ గా జరిగింది కదా అని అన్నారు. అంతటితో అయిపోయింది. కానీ అమరావతి రధోమహోత్సవం అయిపోయిన తర్వాత నేను అప్పిరెడ్డి ఇంకా కొందరం కలసి రిటర్న్ అయి నడుచుకుంటూ వస్తుండగా కొందరు మాతో చాలా దురుసుగా ప్రవర్తించారు'' అని తెలిపారు. 

Latest Videos

''జై అమరావతి, జై సిబిఎన్ అనుకుంటూ కొందరు నా వెనక నినాదాలతో వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నినాదాలతో పాటు నా చెవి వద్దకు వచ్చి బూతులు తిట్టి వెళ్లిపోతున్నారు. సరే మనం ఎదురుతిరిగి మాట్లాడే పరిస్దితి లేదు కాబట్టి పార్టీ నేత అప్పిరెడ్డి చెప్పిన ప్రకారం నా వెహికల్ రాకపోతే అప్పిరెడ్డి వెహికల్ ఎక్కి బయల్దేరాను. మద్దూరు వైపు తిరిగితే నేనున్నాను అని చూసి వెహికల్ పై గుద్దారు'' అని తెలిపారు.

read more  బాపట్ల ఎంపీ సురేష్‌పై దాడికి మహిళల యత్నం, జేఎసీ బస్సును వెంటాడిన యువకులు

''లేమల్లే వద్ద కార్లు మారేందుకు ఆగాం. అక్కడకు ఓ బస్ వచ్చింది. అందులోని మహిళలు జై అమరావతి అని నినాదాలు చెస్తున్నారు. అందులో వున్నవారు అమరావతి మహిళా జేఏసి సభ్యులమని చెప్పినా నమ్మేలా కనిపించలేదు. వారందరూ కూడా టిడిపిలో క్రియాశీలకంగా పనిచేసేవాళ్లే. ఒక యువతి వచ్చి నీవు ఒక ఎంపీవా... నీవు మమ్మల్ని ఏం పీకుతార్రా... అని  అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసింది. నీవు మహిళవు అలా మాట్లాడకూడదు అని చెప్పాను.ఈలోపు పది మహిళలు కారం తీసుకువచ్చి నాపై చల్లారు. 

మా గన్ మెన్లు వచ్చి సార్ వాళ్లు కారం చల్లుతున్నారు అంటూ నన్ను కారులో కూర్చోమని చెప్పారు. ఆ మహిళలు నా వద్ద పనిచేసే లక్ష్మణ్ అనేవ్యక్తిని కొట్టారు. వాళ్ల అన్నను చెప్పుతో కొట్టారు వీటికి సంబంధించి వీడియోలు ఉన్నాయి. అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో దళితులు అనేవాళ్లు తిరగడానికి వీల్లేదు. అందరూ తిరుగుతున్నారు.నందిగం సురేష్ అనే వాడే ఒక టార్గెట్ అనే విధంగా వారి వ్యవహారశైలి ఉంది'' అని అన్నారు.

''సురేష్ పై దాడి చేయాలన్నదే వారి లక్ష్యం. ఏం ఖర్మపట్టింది.కారాలు చల్లాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఏబిఎన్ ,ఈటివి ,టివి5 వారికి  దయచేసి చెబుతున్నాను నిజం మాట్లాడటానికి అలవాటుపడండి. అబద్దాలు మాట్లాడకండి.అబద్దాలు మాట్లాడి మాట్లాడి చంద్రబాబును 23 సీట్లుకు తీసుకువచ్చారు.  లేనిపోనివి కల్పించుకుని చెప్పి
  అమరావతి ప్రజలను కూడా అంతే దీనస్దితికి తీసుకువచ్చేటట్లు ఉన్నారు'' అని సూచించారు.

'' నాపై దాడిలో పాల్గొన్న వాళ్లు అమరావతి ప్రజలు కాదు.అమరావతికి వారికి సంబంధం లేదు.నేను తుళ్లూరు మండలంలోనే తిరుగుతున్నా. ఓ పక్క రైతులు నాకు ఎదురుపడి 
మాకు ఫేవర్ అయ్యేలా చూడు అని మాట్లాడుతున్నారు. దాడికి పాల్పడిన వారందరూ కూడా టిడిపికి పెయిడ్ ఆర్టిస్టులు. ఒక మహిళ వచ్చి నాపై కారం చల్లితే అది మా డ్రైవర్ కోటిపై పడింది.అప్పటికి ఆమె కోటిని కారులోనుంచి చొక్కాపట్టుకుని కిందకు లాగుతోంది.వారి అరాచకం ఆ విధంగా ఉంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  అమరావతిలో రథోత్సవం: రాజధాని ప్రజల ఆందోళన, రైతును ఢీకొన్న వైసీపీ ఎంపీ కారు

''బస్సులో చాలామంది పురుషులు కూడా ఉన్నారు.ఆ బస్సులో చూస్తే ముగ్గురు మా ఊరుకు సంబంధించినవారు ఉన్నారు. వారు నా కదలికలపై వారు సమాచారం ఇస్తున్నారంట. వీళ్లు ఏ స్దాయిలోకి వెళ్లారంటే రాజధానిలో తాము మాత్రమే బతకాలనే విధంగా తయారయ్యారు. దళితులంటే విలువలేదు. కనీసం ఎంపీగా అన్నా గౌరవం ఇవ్వాలి కదా. రాజధాని ప్రాంతంలో దళితులు, ఎంపిగా ఉన్న నేను తిరగొద్దా. చంద్రబాబు చేస్తున్న అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు'' అని మండిపడ్డారు.

''మహిళను నేను తిట్టానని చెబుతున్నారు. వారంతా దాడికి పాల్పడుతున్నా కూడా నేను మహిళలను గౌరవంగా సంబోధించాను. ఇది జరిగిన కాసేపటికే టిడిపి నేత ఆలపాటి రాజా, ఎంపి గల్లా జయదేవ్ లు అక్కడికి ఎలా చేరుకున్నారు. అక్కడ వారు ఉండి మావారిపై దాడిచేశారంటూ అసత్యప్రచారం చేస్తున్నారు.  మహిళలను అడ్డుపెట్టి రాజకీయాలు చేయడం సరికాదు. అది మాకు చేతనవును కాని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలమేరకు హుందాగా నడుచుకుంటున్నాం'' అని అన్నారు. 

''మహిళా జేఏసిగా చెప్పబడుతున్న టిడిపి వారి బస్సులో కారం ప్యాకెట్లు గురించి ఎవరైనా అడిగితే మా బస్సులో వారే వేశారని చెప్పాలంటూ బస్సులోనే రాణి అనే మహిళ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో చూడండి అంటూ ఆ వీడియోను ఎంపీ ప్రదర్శించారు.  మీడియా వాస్తవాలు చూపితే బాగుంటుంది.చంద్రబాబుకు వంతపాడేలా ఏబిఎన్ తో పాటు కొన్ని ఛానల్స్ వైసిపి నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నాయి'' అని ఎంపీ సురేష్ మండిపడ్డారు. 

click me!