దమ్ము, ధైర్యం ఉంటే మాట మీద నిలబడండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్

By Nagaraju penumala  |  First Published Sep 6, 2019, 7:54 PM IST

చంద్రబాబు 40ఏళ్ల రాజకీయం మెుత్తం వెన్నుపోటు, దిగజారడు, చిల్లర రాజకీయాలేనని విమర్శించారు. తాను హిందూ మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళనని తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కులధృవీకరణ పత్రం కూడా ఉందని తెలిపారు. 


అమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

చంద్రబాబులా అబద్దాలు చెప్పడం తమకు తెలియదని ఉండవల్లి శ్రీదేవి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే శ్రీదేవిని ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలను ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు.

Latest Videos

చంద్రబాబు 40ఏళ్ల రాజకీయం మెుత్తం వెన్నుపోటు, దిగజారడు, చిల్లర రాజకీయాలేనని విమర్శించారు. తాను హిందూ మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళనని తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కులధృవీకరణ పత్రం కూడా ఉందని తెలిపారు. 

దమ్ము ధైర్యం ఉంటే తగిన ఆధారాలు చూపించి అన్నమాట మీద నిలబడగలరా అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు సవాల్ విసిరారు. రాజధానిలో చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, కుంభకోణాలు వెలుగులోకి తీసుకొచ్చాననే తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారంటూ విమర్శించారు. 

40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సీఎం జగన్ ను చూసి సిగ్గుపడాలన్నారు. దళితుల్లో ఎవరు మాత్రం పుట్టాలని కోరుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు అయితే దేశచరిత్రలోనే ఏకంగా దళిత మహిళను హోంమంత్రిని చేసిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.   

ఈ వార్తలు కూడా చదవండి

ఎమ్మెల్యే శ్రీదేవి క్రిస్టియన్, దళిత మహిళ అంటూ కుల రాజకీయాలా..?: చంద్రబాబు ఫైర్

శ్రీదేవి దళితురాలే కానప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుంది : మాజీమంత్రి కేఎస్ జవహర్

click me!