గతంలో రాళ్లు, చెప్పులు.... ఈసారి మరేమిటోనని చంద్రబాబు భయపడే...: శ్రీదేవి

By Arun Kumar P  |  First Published Dec 5, 2019, 5:01 PM IST

గతంలో తన పర్యటనకు వ్యతిరేకంగా రాజధాని రైతులు, రైతు కూలీలు చేపట్టిన నిరసనను చూసి భయపడే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో పెట్టుకున్నాడని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు.   


అమరావతి: మరోసారి రాజధానికి వెళ్లే ధైర్యంలేకే చంద్రబాబు నాయుడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడలో పెట్టుకున్నాడని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. కొద్దిరోజులక్రితమే రాజధాని అమరావతి ప్రజలు, రైతులు ఆగ్రహాన్ని చవిచూశాడని... తన వాహనంపై చెప్పులు, రాళ్లు పడటంతో బాబు భయపడిపోయాడని సెటైర్లు విసిరారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో రాజధానిపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పోటీగా తూళ్లూరులో రైతులు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు వైసిపి ఎమ్మెల్యేలు  శ్రీదేవి, జోగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.   

Latest Videos

undefined

ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ... రకరకాల విన్యాసాలతో రైతుల పొట్ట కొట్టిన వ్యక్తి చంద్రబాబని విమర్శించారు.  నవరత్నాల అమలుతో రోజు రోజుకు యువ ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల ఆదరణ ఎక్కువ అవుతోందన్నారు. 

READ MORE  ఆ పిల్లాడి భవిష్యత్ కోసం అమరావతి, చంద్రబాబు ప్లాన్ ఇదే... : గుట్టువిప్పిన బుగ్గన

రాజధాని రైతులు, రైతు కూలీకకు కడుపు మండటం వల్లే అమరావతి పర్యటనలో చంద్రబాబు వాహనంపై చెప్పులు, రాళ్లు విసిరారని అన్నారు. రెండు వేల ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు ప్రభుత్వం గతంలో లాక్కుందని... దీనివల్ల దళిత రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. కనీసం దళితుల పక్కన కూర్చోపెట్టుకోవడానికి కూడా ఇష్టపడని వ్యక్తి చంద్రబాబని అన్నారు.

దళితుల భూములు లాక్కుని వాటిని ఇష్టమొచ్చిన అమ్ముకున్న ఘనత చంద్రబాబుదేనని అన్నారు. అంబేద్కర్ కి కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపి అసెంబ్లీ బిల్డింగ్ నిర్మాణంలో 1000 కోట్లు దండుకున్న చంద్రబాబు త్వరలో శ్రీకృష్ణ జన్మ స్థలానికి వెళ్లనున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాలపై పోటీ పెడితే పెడితే చంద్రబాబు కి మొట్ట మొదటి స్థానం రావడమే కాదు గత రికార్డులన్నీ బద్దలుగొడతాడని ఎద్దేవా చేశారు. ఆయన్ను అమరావతి శిల్పి అని కాకుండా దొంగ అని  సంబోధించాలని...  రాజధాని రైతులకు న్యాయం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసామని శ్రీదేవి తెలిపారు. 

రాజధాని విషయంలో క్షమాపణ చెప్పడానికి సిద్దమే... : రౌండ్ టేబుల్ సమావేశంలో చంద్రబాబు

మరో వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ... ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉందన్నారు. రాజధానిలో సొంత ఇల్లుకూడా లేనటువంటి వ్యక్తి చంద్రబాబని ఎద్దేవా చేశారు. 

రాజధానిపై ఎక్కడో విజయవాడలో అఖిలపక్ష సమావేశంపెట్టడానికి సిగ్గు ఉండాలని...రాజధాని ప్రాంతంలో అఖిలపక్ష సమావేశంపెడితే బాగుండేదన్నారు. రైతుల్ని నిలువునా మోసం చేసి అఖిలపక్ష సమావేశం పెట్టడానికి సిగ్గు ఉందా అని రమేష్ ప్రశ్నించారు. 

  

click me!