తెలుగుదేశం పార్టీ నాయకులు దండుపాళ్యం ముఠాలా మారి అమరావతిని దోచుకున్నారని... ఇప్పుడు ఆ బంగారు గని చేజారిపోతోందనే వారు ఆందోళనకు దిగారని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు.
అమరావతి: గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం చేతుల్లో వుంచుకుని కూడా చంద్రబాబు నాయుడు అమరావతి కోసం ఏ చేయలేదని... కేవలం ఆర్భాటాలు మాత్రమే చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మాత్రం తాను అమరావతి కోసం ఎంతో చేశానంటూ నానా రాద్దాంతం చేస్తున్నాడని అన్నారు. అమరావతి అనిచెప్పి ఓ బ్రమారావతిని చంద్రబాబు సృష్టించారని శ్రీదేవి ఎద్దేవా చేశారు.
టిడిపి అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబును దళిత ద్రోహి అంటూ ఆమె విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కు పాల్పడి దళితులకు చెందిన సుమారు రెండు వేల ఎకరాల భూమిని కొట్టేశారని ఆరోపించారు. దండుపాళ్యం ముఠాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిలువునా దోచుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.
read more అమరావతి నిరసనల సెగ... ఏపి అసెంబ్లీకి జగన్ చేరుకునే దారిదే
అమరావతి రైతులు ఇంకా చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతున్నారు అని శ్రీదేవి ప్రశ్నించారు. కేవలం తన బంగారు గని చేజారిపోతుందనే చంద్రబాబు అమరావతిలో నిరసనలు చేపడుతున్నారని... అక్కడి రైతులు, ప్రజల గురించి ఆయనకు ఏమాత్రం పట్టదన్నారు.
చంద్రబాబు నాయుడు పాపాలే అమరావతికి శాపాలుగా మారాయన్నారు. ఇప్పటికయినా అమరావతి ప్రజలు చంద్రబాబును నమ్మకూడదని అన్నారు.అలా కాకుండా ఆయనవెంటే వుండి తమ జీవితాలు నాశనం చేసుకోకండని ఉండవల్లి శ్రీదేశి సూచించారు.