కోడెలది ఆత్మహత్యేనా...?లేక హత్యా...?: అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్

By Arun Kumar PFirst Published Oct 16, 2019, 7:07 PM IST
Highlights

ఏపి మాజీ అసెంబ్లీ స్పీకర్, టిడిపి సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై వైసిపి ఎమ్మెల్యేే షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆయనది ఆత్మహత్యో...హత్యో తెలియడంలేదన్నారు.  

అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో వైస్సార్సీపీ కార్యకర్తను చంపడం దారుణమని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. వైసిపి కోసం పనిచేశాడనే అతడిపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపించారు. వైసిపి కార్యకర్త హత్యకు టీడీపీ బాధ్యత వహించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలను  రెచ్చగొట్టడం వల్లే వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు అంబటి పేర్కొన్నాడు. 

ఏపీలో జరగని విషయాలను కూడా జరిగినట్లుగా చంద్రబాబు చూపిస్తున్నారన్నారు. అద్భుతమైన పరిపాలనను జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే.. చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలన చూసి ఓర్వలేక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను మరో బీహార్ చేస్తున్నారని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

చంద్రబాబు హయాంలో జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగింది....కాపు ఉద్యమం కోసం ముద్రగడ దీక్ష చేస్తే అరెస్ట్ చేయించావు...ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేస్తే జైల్లో పెట్టించిన విషయాలు చంద్రబాబుకు గుర్తులేనట్లున్నాయి. అలాంటి వ్యక్తి సిగ్గులేకుండా ఇప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

''సొంత పార్టీ వారు తప్పు చేసినా చర్యలు తీసుకోమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కానీ టీడీపీ నాయకుల మధ్య జరిగిన తగాదాలు, అధికారులపై టీడీపీ నేతలు చేసిన దాడులపై పంచాయితీలు చేసింది చంద్రబాబే. అధికారి వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే పంచాయతీ చేసింది నువ్వు కాదా...ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై మీ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే దాడి చేస్తే పంచాయితీ చేసింది నువ్వు కాదా..?పంచాయితీలు చేసిన చంద్రబాబే పులివెందుల పంచాయితీ అంటూ జగన్మోహన్ రెడ్డి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.'' అని అంబటి ఎద్దేవా చేశారు. 

టీడీపీ నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరగాల్సిన అవసరం వుందన్నారు. అప్పుడే టీడీపీ నేతలపై దాడులు జరిగాయో...లేదో... వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయన్నారు.

చంద్రబాబు అధికారంలో వుండగా మీడియా, ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అరాచకాలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని... జపాన్ కు చెందిన మాకీ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు అరాచకాలు గురించి ప్రపంచ దేశాలకు కూడా తెలిసేలా చేశారని తెలిపారు. కోడెల ఆయన కుటంబ సభ్యులు అనేక అరాచకాలకు పాల్పడ్డారన్నారు. కోడెల చేసిన ఘోరాల  గురించి ప్రజాలందరికి తెలుసన్నారు. అసలు కోడెలది హత్యా...ఆత్మహత్యా అనేదిపై కూడా ఢిల్లీ నుంచి వచ్చే అధికారులు విచారణ జరపాలన్నారు.  

వైస్సార్సీపీ వలనే కోడెల చనిపోయాడని ముద్ర వేసే ప్రయత్నం చంద్రబాబుచేస్తున్నారని పేర్కొన్నారు. మానవ హక్కుల కమీషన్ నివేదిక చంద్రబాబు చెంప చెల్లిమనిపించేలా ఉంటుందని భావిస్తున్నట్లు అంబటి తెలిపారు. 
 

click me!