అమరావతిలో సీమ లాయర్ల ఆందోళన: సమస్యకు మూలం టీడీపీయేనంటూ ఫైర్

By Siva Kodati  |  First Published Oct 16, 2019, 11:48 AM IST

 శ్రీబాగ్ ఒప్పందం మేరకు హైకోర్టును రాయలసీమకు తరలించాలని తమ ఈ విషయంపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని సంప్రదించలేదని న్యాయవాదులు స్పష్టం చేశారు.  అన్ని వ్యవస్థలను అమరావతిలో తెచ్చిపెట్టింది టీడీపీయేనని.. హైకోర్టు కోస్తాలో ఉండాలని ఈ ప్రాంత న్యాయవాదులు కోరితే రాజధానిని సీమకివ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు. 


ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలంటూ సాగుతున్న ఆందోళన మరింత తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో సీమ న్యాయవాదులు రాజధాని అమరావతిలో బుధవారం నిరసనకు దిగారు.

అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన లాయర్లు హైకోర్టును రాయలసీమకు తరలించాలని నినాదాలు చేశారు. సీఎంను కలిసేంత వరకు సెక్రటేరియేట్‌ను విడిదిలేదని స్పష్టం చేశారు.

Latest Videos

undefined

సచివాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాయలసీమలోనే హైకోర్టు ఉండాలన్నారు.

ప్రతిపక్షంలో ఉండగా సపోర్ట్ చేయడం.. అధికారంలోకి వెళ్లాక తమ డిమాండ్‌ను పక్కనబెట్టడం పార్టీలకు అలవాటైపోయిందని వారు మండిపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు హైకోర్టును రాయలసీమకు తరలించాలని తమ ఈ విషయంపై ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని సంప్రదించలేదని న్యాయవాదులు స్పష్టం చేశారు.  

అన్ని వ్యవస్థలను అమరావతిలో తెచ్చిపెట్టింది టీడీపీయేనని.. హైకోర్టు కోస్తాలో ఉండాలని ఈ ప్రాంత న్యాయవాదులు కోరితే రాజధానిని సీమకివ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు. 

click me!