స్థానిక సంస్థల ఎన్నికలు.. బాబు అప్పుడలా, ఇప్పుడిలా: సజ్జల వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 9, 2020, 6:43 PM IST
Highlights

స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేలా తాము ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 

స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం సరఫరాను అడ్డుకునేలా తాము ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల.... తమను స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బెదరగొడుతున్నారని బాబు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు.

Also Read:2014లో రుణమాఫీ హామీ అందుకే ఇవ్వలేదు.. లేకుంటే: సజ్జల

2014 ఎన్నికలకు ముందు హడావిడిగా స్థానిక ఎన్నికలు జరిపారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. నాడు వైసీపీ ఇంకా సంస్థాగతంగా పటిష్టం కాలేదని, జగన్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మాత్రమే పెట్టుకుని ముందుకు వెళ్లామన్నారు.

తనకు బినామీలా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి లగడపాటిని రాయబారం పంపి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకొచ్చారని సజ్జల విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబులా అప్పుడు మేము ఇలా గగ్గోలు పెట్టలేదని ధైర్యంగానే ఎన్నికలను ఢీకొన్నామని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.

Also Read:చంద్రబాబు కరోనావైరస్ లాంటివాడు, షరీఫ్ అంగీకరించారు: సజ్జల

అయితే ఎన్నికల ఫలితాలను కోర్టు కొంతకాలం వాయిదా వేసిందన్నారు. దేశంలోనే సంస్థాగతంగా బలంగా ఉన్న పార్టీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్షనేతగా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తి అధినేతగా ఉన్న పార్టీ ఇప్పుడు ఇలా మాట్లాడటం చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నారు. 

click me!