తాడేపల్లిలో మందుబాబు వీరంగం... భార్యతో గొడవపడి ఒంటిపై వేడినీళ్లు

By Arun Kumar P  |  First Published May 8, 2020, 7:58 PM IST

మద్యంమత్తులో భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకుంది.  


అమరావతి: లాక్ డౌన్ సడిలింపుతో ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలన్నర పాటు మద్యానికి  దూరమైన మందుబాబులు మళ్లీ తాగుడు మొదలెట్టారు. ఇలా మద్యం అమ్మకాలు మొదలైనప్పటి నుండి ప్రమాదాలు, గొడవలు మొదలయ్యాయి. ఇలా ఫూటుగా తాగిన ఓ వ్యక్తి భార్యతో గొడవపడి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకుంది. 

తాడేపల్లి మండలం నులకపేట గ్రామానికి చెందిన చిట్టిబాబు మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య తిట్టిందని మనస్థానికి గురయిన అతడు మత్తులో ఏం చేస్తున్నాడో మరిచిపోయాడు. ఇంట్లోవున్న వేడి నీటిని ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

Latest Videos

బాగా వేడిగా వున్న నీటిని పోసుకోవడంతో ఒళ్ళంతా కాలిపోయి విలవిల్లాడిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు హుటాహుటిన 108 వాహనంలో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 

click me!