కుట్ర భగ్నం: భార్య మరో వ్యక్తితో గడిపిన ఫొటోలు తీసి...

Published : Oct 01, 2019, 08:09 AM IST
కుట్ర భగ్నం: భార్య మరో వ్యక్తితో గడిపిన ఫొటోలు తీసి...

సారాంశం

తనను చంపడానికి భార్య తన ప్రియుడితో కలిసి పన్నిన కుట్రను భర్త భగ్నం చేశాడు. తన భార్య ప్రియుడితో ఏకాంతంగా గడిపిన చిత్రాలను, వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డు చేసి పోలీసులకు ఇచ్చాడు.

గుంటూరు: తెలివిగా వ్యవహరించిన భర్త తనను చంపడానికి భార్య పన్నిన కుట్రను భగ్నం చేశాడు. తనకు విషం పెట్టి చంపాలని తన భార్య పన్నిన కుట్రను అతను పసిగట్టాడు. భార్యపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు పరుగులు తీశాడు. తన భార్య, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి తనను చంపడానికి కుట్ర చేశారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఆ సంఘటన గుంటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తనను అడ్డు తొలగించుకోవడానికి వారిద్దరి మధ్య సాగిన ఫోన్ సంభాషణలను, ఏకాంతంగా గడిపిన అశ్లీల చిత్రాలను అతను పోలీసులకు అందించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు మీడియాతో మాట్లాడాడు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన యువకుడు బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో అతనికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. భార్య ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దాన్ని గమనించి అతను భార్యను మందలించాడు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదు. 

భర్తపై, అతని కుటుంబ సభ్యులపై ఆమె కేసు పెట్టింది. దాంతో వాళ్లంతా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో మహిళ తన ప్రియుడితో హైదరాబాద్, గుంటూరు లాడ్జీలకు తిరుగుతున్నట్లు బాధితుడు గుర్తించాడు. వారిపై కన్నేసి ఉంచాడు.

తనకున్న పరిచయాలతో ఆమె వేరే వ్యక్తితో ఏకాంతంగా గడిపినప్పటి చిత్రాలను, వీడియోలను, వారి మధ్య సాగిన వాయిస్ కాల్స్ ను సేకరించాడు. ఈ సంభాషణలో తనను చంపడానకిి వారిద్దరు పన్నిన కుట్రను తెలుసుకున్నాడు. ఆ ఆధారాలను పోలీసులకు ఇచ్చి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా