ప్రతిరోజు నీలిచిత్రాలు చూడటం దుర్గాప్రసాద్‌కు వ్యసనంగా మారింది. అక్కడితో ఆగకుండా ఇంటికి సమీపంలోని బాలికలను పిలిచి వారికి కూడా ఆ దృశ్యాలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు
ఉన్మాదిలా మారిన ఓ వ్యక్తి పదేళ్ల బాలికకు నీలి చిత్రాలు చూపించాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ వెదురు బొంగుల నిచ్చెనలు తయారు చేసి వాటిని విక్రయిస్తూ ఉండేవాడు.
పెళ్లయి 16 ఏళ్లు కావొస్తున్నా సంతానం కలగలేదు. అతని వేధింపుల కారణంగా భార్య సైతం పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి తోడు ప్రతిరోజు నీలిచిత్రాలు చూడటం దుర్గాప్రసాద్‌కు వ్యసనంగా మారింది.
అక్కడితో ఆగకుండా ఇంటికి సమీపంలోని బాలికలను పిలిచి వారికి కూడా ఆ దృశ్యాలను చూపిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. దీనిని పసిగట్టిన స్థానికులు దుర్గాప్రసాద్‌కు గతంలో దేహశుద్ధి చేశారు.
అయినప్పటికీ బుద్ది మార్చుకోని అతను శనివారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పదేళ్ల బాలికను పిలిచి సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూపించాడు.
దీంతో భయపడిని ఆ చిన్నారి ఏడుస్తూ వెళ్లి తల్లికి విషయం చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె స్థానికుల సాయంతో దుర్గాప్రసాద్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది.