గుంటూరులో విషాదం... వీధికుక్కల దాడిలో మూడేళ్ల చిన్నారి మృతి

By Arun Kumar P  |  First Published May 1, 2020, 10:40 AM IST

అభం శుభం తెలియని ఓ మూడేళ్ల చిన్నారి కుక్కకాటుతో మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. 


గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి బయట సరదాగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై విధికుక్కలు దాడిచేసి  తీవ్రంగా గాయపర్చారు. కుక్క కాటుకు గురయిన చిన్నారికి మైరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ(శుక్రవారం) చిన్నారి మృతిచెందింది. 

ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో సఫియా(3సవంత్సరాల వయస్సు) అనే చిన్నారి ఆరుబయట ఒంటరిగా ఆడుకుంటుండగా ఒక్కసారిగా విధికుక్కలు దాడిచేశాయి. ఒక్కసారిగా కుక్కల  మీదపడి కరిచేయడంతో  చిన్నారి తీవ్రంగా గాయపడింది. 

Latest Videos

ఈ దాడిని గమనించిన వారు  కుక్కల బారినుండి చిన్నారికి కాపాడారు. ఒంటినిండా గాట్లతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి మెరుగయిన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా చికిత్సపొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.   

ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడిచేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీ సిబ్బంది వెంటనే స్పందించి ఈ కుక్కల బెడద నుండి గ్రామస్తులను కాపాడాలని కోరుతున్నారు. చిన్నారి మృతితో యావత  గ్రామం విషాదంలో మునిగిపోయింది. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు.  

 

click me!