మంగళగిరి ప్రభుత్వాఫీసులో డ్రైవర్ కు కరోనా: గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు

By telugu team  |  First Published Apr 27, 2020, 11:55 AM IST

మంగళగిరిలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో డ్రైవరుకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో కార్యాలయంలోని ఉద్యోగులకు గుట్టుచప్పుడు కాకుండా కరోనా పరీక్షలు నిర్వహించారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్ లో ఓ ప్రభుత్వ కార్యాలయంలో కరోనా కలకలం చెలరేగింది. కార్యాలయం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితేగుట్టుచప్పుడు కాకుండా జిల్లా వైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది కి పరిక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం పలువురిని క్వారంటైన్ కు తరలించారు. కార్యాలాయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరుకుంది. వీరిలో ఇప్పటి వరకు 235 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 31 మంది మరణించారు. 

Latest Videos

గత 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 33, కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం ఒక కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసుల నమోదులో 292 కేసులతో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 237 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, కృష్ణా జిల్లాలో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 210కి చేరుకుంది. కొత్తగా అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం, కడప, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మరో కేసు నమోదు కావడంతో సంఖ్య 4కు చేరకుంది.

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 53
చిత్తూరు 73
తూర్పు గోదావరి 39
గుంటూరు 237
కడప 58
కృష్ణా 210
కర్నూలు 292
నెల్లూరు 79
ప్రకాశం 56
శ్రీకాకుళం 4
విశాఖపట్నం 22
పశ్చిమ గోదావరి 54

click me!