''జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ''...అలాగయితేనే జగన్ ఈగో చల్లబడుతుంది...: వంగలపూడి అనిత

By Arun Kumar P  |  First Published Feb 24, 2020, 6:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టిడిపి పథకాలను కాపీ కొడుతూ తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. 


గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన పథకాల పేర్లను మార్చి తానేదో ప్రజలను ఉద్దరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. తాజాగా వైసిపి ప్రభుత్వం  ప్రారంభించిన ''జగనన్న వసతి దీవెన'' పథకం కూడా అలాంటిదేనని అన్నారు.  

''జరగాలి పెళ్లి మళ్లీ మళ్లీ అన్నట్టు పథకాల పేర్లు మార్చి రిబ్బన్ కట్ చేస్తున్నారు. రంగులు మార్చి సంబర పడుతున్నారు. అమరావతి మాత్రం ఏం తప్పు చేసింది పాపం? ''జగనన్న అమరావతి'' అనో లేదా ''విజయమ్మావతి'' అనో మార్చుకోండి.  మీ ఇగో చల్లబడుతుంది జగన్ గారు'' అంటూ ట్విట్టర్ ద్వారా సెటైర్లు వేస్తూనే తీవ్ర విమర్శలు  చేశారు అనిత. 

Latest Videos

undefined

read more  భువనేశ్వరిలా నీకు సాధ్యం కాదు... కనీసం అలాగయినా..: విజయమ్మపై అనిత వ్యాఖ్యలు

గతంలోనూ జగన్, ఆయన భార్య భారతిలపై ఆంధ్ర ప్రదేశ్ టిడిపి మహిళా ఆధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇలాగే  ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు. తన పేరుమీదే కాదు భార్యపేరు  మీద కూడా జగన్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. అందులో ఒకటే భారతి సిమెంట్ వ్యవహారమని... అక్రమ మార్గంలో భారీ డబ్బులు ఈ సంస్ధకు పెట్టుబడుల  రూపంలో వచ్చాయన్నారు.

''శివ,పార్వతుల అన్యోన్యత వివాహ వ్యవస్థ కి ఉన్న గొప్పతనానికి నిదర్శనం అలాంటి శివరాత్రి రోజున ఇలాంటి వార్త చూడాల్సి వస్తుంది అని అనుకోలేదు.భార్య ని దైవంగా భావించే మన దేశంలో భార్య పేరుతో జగన్ గారు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించి వివాహ వ్యవస్థ కే కలంకం తీసుకొచ్చేలా చేసారు.''

 ''క్విడ్ ప్రో కో ద్వారా భార్య పేరుతో ఉన్న భారతి సిమెంట్స్ లో రూ.96 కోట్లు అక్రమ పెట్టుబడులు ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టారు.మరో 40 కోట్లు జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడి పెట్టారు.అధిక ప్రీమియం కి ఈ షేర్లని కొన్నారు. అందుకే అవి దొంగ పేపర్,ఛానల్ అయ్యాయి.''

read more  చంచల్ గూడానా, ఎడారి జైలా...లేక జగన్ గతి పావురాల గుట్టేనా..: బుద్దా వెంకన్న

''క్విడ్ ప్రో కో లో భాగంగా జగన్ గారు ఇండియా సిమెంట్స్ కి చెందిన మైన్ లీజులు పొడిగించారు అని ఈడీ హై కోర్టు లో వాదనలు వినిపించింది.ఇన్ని అక్రమాలు చేసి, భార్య పేరు మీద కూడా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి సాక్షులను బెదిరించలేరా?''అంటూ వరుస ట్వీట్లలో భారతి సిమెంట్ పేరిట అక్రమాల గురించి అనిత వివరించారు. 


 

click me!