అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

Siva Kodati |  
Published : Oct 07, 2019, 07:00 PM IST
అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సోమవారం విట్ కాలేజ్‌కు సమీపంలో 28 నుంచి 35 సంవత్సరాల వయసున్న పురుషుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. సోమవారం విట్ కాలేజ్‌కు సమీపంలో 28 నుంచి 35 సంవత్సరాల వయసున్న పురుషుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుమారు 7 నుంచి 10 రోజుల క్రితం మరణించి వుండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

లేత ఆకుపచ్చని స్పోర్ట్స్ షార్ట్ ధరించి వున్నాడని.. ఎవరికైనా సమాచారం తెలిస్తే  ఈ క్రింది నెంబర్లను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

సీఐ తుళ్లూరు: 9440900860
ఎస్ఐ తుళ్లూరు: 9550257778

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా