రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనవల్లే నష్టం...: టిడిపి ఎంపీలు

మరికొద్దిరోజుల్లో శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో టిడిపి ఎంపీలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించిన విధానాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.    


అమరావతి: మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న శీతాకాల సమావేశాల నేపథ్యంలో టిడిపి ఎంపీలతో ఆ పార్టీ అధినేత భేటీ అయ్యారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై వీరిమధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. 

ఈ సమావేశం ముగిసిన అనంతరం ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ....టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత శీతాకాల సమావేశాల్లో లెవనెత్తాల్సిన అంశాలపై చర్చించామన్నారు. 

Latest Videos

రాష్ట్రంలో అమలవుతున్న అప్రజాస్వామిక విధానాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని.... రివర్స్ టెండరింగ్ తో పాటు మీడియా పై ఆంక్షలు, ఇతర సమస్యలపై మా పోరాటం ఉంటుందని తెలిపారు.తెలుగు భాష ను రివర్స్ చేస్తున్నారని...విద్యార్థుల్లో భాషాభివృద్ధిని నాశనం చేస్తున్నారని గల్లా మండిపడ్డారు. 

read more  నోరు మూసుకుని కూర్చోలేను, వంశీపై చర్యలు తీసుకుంటా: స్పీకర్ తమ్మినేని సీతారాం

మరో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ...తిరోగమన నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఉనికికే ప్రమాదం తెచ్చేలా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే జగన్ పాలనలో జరిగే నష్టమే ఎక్కువగా వుందన్నారు. ఈ అంశాలను పార్లమెంట్ లో లెవనెత్తుతామని తెలిపారు. 

శ్రీకాకుళం ఎంపీ  రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పార్లమెంట్ ద్వారా దేశానికి తెలుపుతామని... కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని సరైన మార్గంలో నడిపించేలా ఒత్తిడి తెస్తామన్నారు.

read more  పార్టీ మారుతూ అధినేతను ఏదో ఒకటి అంటున్నారు: వంశీపై జేసీ ఫైర్

 మాతృభాషను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపైనా ఉందని...రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై కేంద్ర జోక్యం కోరతామన్నారు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్ లోనూ ప్రశ్నిస్తామన్నారు. ప్రధాన బిల్లుల ప్రవేశపెట్టేటప్పుడు సామాన్య ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు.

ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిపై కేంద్ర వైఖరి ఏమిటో కూడా స్పష్టత కోరతామన్నారు. రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్ లోనూ ప్రశ్నలు లేవనెత్తుతామని... రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విషయంలో స్ఫష్టతనిచ్చేలా కేంద్రం ఒత్తిడి చేసేలా ఉద్యమిస్తామన్నారు. 


 

click me!