ఆ ఛాలెంజ్ ఓకే... ఇప్పుడు బుద్దా ఛాలెంజ్ కు సిద్దమా...: జగన్ కు ఎమ్మెల్సీ సవాల్

By Arun Kumar PFirst Published Feb 12, 2020, 2:28 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి విరుచుకుపడ్డారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిలపై టిడిపి ఎమ్మెల్సీ  బుద్దా వెంకన్న ట్విట్టర్ వార్ కొనసాగిస్తూనే వున్నారు. గతకొంతకాలంగా వీరిద్దరిని, వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలా ఇవాళ(బుధవారం) కూడా తన ట్వీట్లతో విమర్శలు గుప్పించారు వెంకన్న.  

''గ్రీన్ ఛాలెంజ్ అని రెండు మొక్కలు నాటి పారిపోతే ఎలా విజయసాయి రెడ్డి  గారు? బుద్దా ఛాలెంజ్ స్వీకరించండి. మూడు ముక్కల రాజధాని అంటున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకుంటుంది అని ముసలి కన్నీరు కారుస్తున్నారు'' అని సవాల్ విసిరారు.. 

''9 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా  వైఎస్ జగన్ రాయలసీమకి, ఉత్తరాంధ్రకి, రాష్ట్రానికి ఏం చేశారో చర్చకు నేను సిద్ధం. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసింది లేదు'' అని వెంకన్న ప్రశ్నించారు.

read more  స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచుతూ పట్టుబడితే అనర్హత, జైలు శిక్ష: ఏపీ కేబినెట్ సంచలనం
 
''చంద్రబాబు గారు చేసిన అభివృద్ధికి పార్టీ రంగులు వేసుకోవడానికే మీకు 9 నెలలు సరిపోలేదు. చంద్రబాబు గారు కట్టిన భవనాలకు మళ్లీ జగన్ గారితో రిబ్బన్ కటింగ్ చేయించడం సిగ్గుగా లేదా సాయి రెడ్డి గారు?'' అంటూ ఎద్దేవా చేశారు.

''ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గారు 9 నెలల్లో వెలగబెట్టింది ఏంటంటే... కొత్త పాలసీ పేరుతో ఇసుక కృత్రిమ కొరత సృష్టించారు. వైకాపా ఇసుకాసురలతో ఇసుక రేట్లను ఆకాశానికి చేర్చి ప్రజల్ని దోచుకుంటున్నారు'' మండిపడ్డారు. 

read more   సుగాలి ప్రీతి కేసులో జగన్ సంచలన నిర్ణయం .. పవన్ ర్యాలీకి బ్రేక్

''మూడు రాజధానులు నిర్ణయాన్ని ప్రజలు ఛీ కొట్టేసరికి కేంద్ర పెద్దలకు పొర్లు దండాలు పెట్టి, బొంగరంలా వారి చుట్టూ తిరగడానికి ఢిల్లీ బయలుదేరారు'' అంటూ జగన్, విజయసాయి రెడ్డిలపై వెంకన్న విమర్శలు గుప్పించారు. 
 

click me!