మీకింకా నాలుగేళ్లుంది...అంత తొందరెందుకు..: జగన్ సర్కార్ కు ఎమ్మెల్సీ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Feb 20, 2020, 9:40 PM IST
Highlights

ఇళ్ల స్ధలాల పేరిట నిరుపేదలకు గత  ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను జగన్ సర్కార్ లాక్కుంటోందని టిడిపి ఎమ్మెల్సీ అశోోక్ బాబు ఆరోపించారు. 

గుంటూరు: ఇళ్ల స్థలాల పేరుతో అరాచకాలకు పాల్పడుతూ ప్రభుత్వం పేదల భూములు లాక్కోవటం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు అన్నారు. ఉగాది పండగనాటికే అంతా జరిగిపోవాలంటూ... పేదల భూములు లాక్కుని అరాచకం చేయటం ప్రభుత్వ మూర్వత్వమని విమర్శించారు. 

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానంటోందని గుర్తుచేశారు. ఇలా 25 లక్షల మందికి ఒక సెంటు స్ధలం ఇవ్వాలన్నా 25 వేల ఎకరాలు... మౌళిక సదుపాయాలు, రోడ్లు కోసం మరొక 20 వేల ఎకరాలు కావాలన్నారు. రాష్ర్ట వ్యప్తంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే మొత్తం సుమారు 40 వేల ఎకరాలు కావాలన్నారు. 

అయితే ఇందుకోసం దళితుల భూములను లాక్కోవడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి మరో 4 ఏళ్ల సమయం ఉందని... ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే చట్ట ప్రకారం భూసేకరణ చేసి ఆ సమయంలోపు అందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చన్నారు. కావాలంటే విడతల వారీగా కూడా ఇవ్వొచ్చన్నారు.  

read more పాదయాత్రలో ముద్దులు... పరిపాలనలో గుద్దులు ...: జగన్ పై మాజీ మంత్రి సెటైర్లు

టీడీపీ ప్రభుత్వం పేదలకోసం కొన్ని లక్షల ఇళ్లు నిర్మించిందని... కానీ ఈ ప్రభుత్వం వాటిని లబ్డిదారులకు ఇవ్వకపోగా తిరిగి పేదల భూములు లాక్కుని  ఇళ్ల పట్టాలివ్వడం ఏంటని అడిగారు. ముందు ఆ ఇళ్లను లబ్డిదారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

అసైన్డ్ భూములు సాగుచేసుకుంటున్నవారికి వాటిపై అధికారాలున్నప్పటికీ లాగేసుకోవడం దారుణమన్నారు. కొన్నిచోట్ల ఏకంగా  25 సంవత్సలరాల నుంచి సాగుచేసుకుంటున్న వారి నుంచి కూడా భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన వారి భూములు ఇళ్ల స్ధలాలుగా మార్చటం, పేదల ఇళ్లు కూల్చడం వంటి అరాచకాలు చేయటం దుర్మార్గమన్నారు. 

ఇప్పటికే భూసేకరణపై కొంతమంది బాధితులు కోర్టుకెళ్ళారని... వారి ఆవేదనను గుర్తించిన న్యాయస్థానం నోటీసులు కూడా ఇచ్చిందన్నారు.  డీ.కె పట్టా భూములు తీసుకోవటంపై ఇప్పటికే కోర్టు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయటం సరికాదన్నారు. భూసేకరణ అనేది చట్టం ప్రకారం జరగాలని.. లేకపోతే బాధితులు కోర్టుకెళ్తే లబ్డిదారులకు  ఆ స్ధలాలు చెందకుండా పోతాయన్నారు. 

read more  చంద్రబాబు తీహార్ జైలుకే... అహ్మద్ పటేల్ హవాలా వ్యవహారంలో...: శ్రీకాంత్ రెడ్డి

మత్స్యకారుల అధికంగా ఉన్న జిల్లాలో చెరువులు పూడ్చటంపై, మరి కొన్ని జిల్లాల్లో భూములు లాక్కోవటంపై కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు.  రాజధానిలో ఉన్న 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాలకు వినియోగించటం సరికాదన్నారు.  సీఆర్డీయే చట్టం ప్రకారం రాజధాని అవసరాల కోసమే ఆ భూములు రైతులు ఇచ్చారని పేర్కొన్నారు. 

సీఎం జగన్ కి చిత్తశుద్ది ఉంటే చట్ట బద్దంగా భూములు సేకరించి మౌళిక సదుపాయలు కల్పించి ఇళ్ల స్ధలాలివ్వాలని అన్నారు. అలా కాకుండా వైసీపీ అరాచకం, రౌడీయజం చేస్తే టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందని అశోక్ బాబు హెచ్చరించారు.

click me!