మండలి కాదు అసెంబ్లీని కూడా రద్దుచేయాలి...అప్పుడు 3 కాదు 30..: అచ్చెన్నాయుడు సవాల్

By Arun Kumar PFirst Published Jan 27, 2020, 4:00 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ శాసనసమండలి రద్దుపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం...దానిపై వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులే చర్చ చేపట్టడాన్ని మాజీ మంత్రి, శాసనసభాపక్ష ఉపనేత కింజారపు  అచ్చెన్నాయుడు తప్పుబట్టారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా సోమవారం కేబినెట్ మండలి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోందిచి ఆ తర్వాత శాసనసభలో  కూడా ప్రవేశపెట్టారు.  అయితే ఈ మండలి రద్దును వ్యతిరేకిస్తున్న టిడిపి తరపున మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. 

శాసనమండలి కాదు దమ్ముంటే అసెంబ్లీ మొత్తాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని అచ్చెన్నాయుుడు సవాల్ విసిరారు. సాయంత్రం లోగా అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్ కు తీర్మానం పంపాలని... తమ సవాల్ ను స్వీకరించి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల అభిప్రాయం తీసుకొండని సూచించారు. అప్పుడు 3 రాజధానులు కాదు 30 రాజధానులయినా కట్టుకొండని అచ్చెన్నాయుడు అన్నారు. 

మండలిరద్దుపై ప్రధాన ప్రతిపక్షమైన  తమను సంప్రదించకుండానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని... ఇది ప్రజాస్వామ్యాన్ని  అపహాస్యం చేయడమేనని అన్నారు. వైసిపి ప్రభుత్వ  నిరంకుశ  నిర్ణయాలను కేంద్రం దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. అలాగే ఇవాళ సాయంత్రం తమ కార్యాచరణ ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు వెళ్ళడించారు. 

read more  చంద్రబాబు నిర్ణయాన్నే జగన్ అమలుచేస్తున్నారు...అయినా ఇంకా...: చెవిరెడ్డి

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వల్ల చాలా బాధ పడుతున్నానని... పవిత్రమైన అసెంబ్లీని వైసీపీ కార్యాలయంలా నడిపిస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో మూడు రోజులు అని ఎజెండా నిర్ణయించి వాటిని పొడిగించారని... ఇలా పొడిగిస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదన్నారు. ఈరోజు బిఎసి ,అసెంబ్లీ సమావేశాలు గురించి తమకు సమాచారం లేదన్నారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో 32 బిల్లులు పెట్టారన్నారని... వాటిలో ఏ బిల్లును వ్యతిరేకించలేమన్నారు. కానీ ఈ మూడు రాజధానులు బిల్లును మాత్రమే ఎందుకు వ్యతిరేకించామో ప్రజలకు తెలుసన్నారు.  

అనేక రాష్ట్రాల్లో మండలి లేదని... ఉన్న రాష్ట్రాలు కూడా రద్దు చేస్తున్నారని వైసిపి నాయకులు అంటున్నారని... అయితే దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు మరి దాన్నెందుకు ఫాలో కావడంలేదు అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలు పెట్టి  వైసిపి లోకి తీసుకున్నారని మండిపడ్డారు.

read more  

ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ధర్మాన  ప్రసాదరావులకు మంత్రులుగా ఉన్నపుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకు రాలేదా...? అని ప్రశ్నించారు. మండలిలో మేధావులు, విద్యావంతులు, బలహీనం వర్గాల సభ్యులకు చోటు దక్కుతుందని... అలాంటి పెద్దల సభను రద్దుచేయడాన్ని టిడిపి వ్యతిరేకిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. 

 

click me!