రాష్ట్రంలో ముద్దాయిల పాలన...జగన్ బయటపడటం కష్టమే...: వర్ల రామయ్య

By Arun Kumar P  |  First Published Nov 1, 2019, 9:35 PM IST

న్యాయస్థానాలపై ప్రజలకు ఒకనమ్మకం, ధైర్యం కల్పించేలా.. న్యాయవ్యవస్థలు వాటికాళ్లపై అవే నిలబడ్డాయనే సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా సీబీఐ కోర్టు  జగన్ అక్రమాస్తుల కేసులో తీర్పు వెలువరించిందని టిడిపి నాయకులు వర్ల రామయ్య  పేర్కొన్నారు.    


గుంటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తనమీదున్న 11కేసుల విచారణకి సంబంధించి వారంవారం సీబీఐకోర్టుకి రాలేనని, తనతరుపున న్యాయవాది హాజరవు తారని వేసిన పిటిషన్‌ ను సీబీఐ కోర్టు తిరస్కరించడం చాలా మంచి పరిణామమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య పేర్కొన్నారు. జగన్‌ అధికారం, హోదా వంటివి చూసి మినహాయింపులు ఇవ్వడం కుదరదని... ప్రతి శుక్రవారం తప్పనిసరిగా న్యాయస్థానానికి హాజరుకావాలని సుస్పష్టంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో న్యాయవ్యవస్థకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నానని ఆయన తెలిపారు. 

శుక్రవారం ఆయన గుంటూరు లోని పార్టీరాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి, తనకుతాను ప్రత్యేకస్థానాన్ని ఆపాదిం చుకుంటూ, న్యాయస్థానాలకు హాజరు కాకుండా మినహాయింపు కోరడమేతప్పని రామయ్య స్పష్టంచేశారు. ముఖ్యమంత్రైనా, ప్రధానమంత్రైనా, సామాన్యుడైనా, రిక్షాతొక్కేవాడైనా చట్టంముందు అందరూ సమానమనే విషయాన్ని మర్చిపోయిన జగన్ ప్రత్యేకమినహాయింపు కోరుతూ చట్టాన్నే ఛాలెంజ్‌ చేశాడన్నారు. 

Latest Videos

undefined

న్యాయస్థానాలపై ప్రజలకు ఒకనమ్మకం, ధైర్యం కల్పించేలా.. న్యాయవ్యవస్థలు వాటికాళ్లపై అవే నిలబడ్డాయనే సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందన్నారు. వారంవారం తానుకోర్టుకు హాజరైతే రూ.60లక్షలు ఖర్చవుతాయని జగన్మోహన్‌రెడ్డి తన అఫిడవిట్‌లో చెప్పడం ఇప్పటికీ విడ్డూరంగా ఉందన్నారు.  

read more  సీబీఐ కోర్టులో చుక్కెదురు: హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు

విమానంలో వెళ్లినా కూడా రూ.60లక్షలు కావని, ఎన్నిలక్షలు ఖర్చయినా, ప్రభుత్వ ఖజానా నుంచి జగన్మోహన్‌రెడ్డి ఒక్కరూపాయికూడా వాడటానికి వీల్లేదని వర్ల తేల్చిచెప్పారు. సీబీఐ వేసిన 11 ఛార్జ్‌షీట్లన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై వేయలేదని, వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సన్నాఫ్‌ రాజశేఖర్‌రెడ్డిపై మోపబడ్డాయన్నారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులకు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి సంబంధం లేనప్పుడు రూ.60లక్షలు ఎలా ఖర్చవుతుందని రామయ్య ప్రశ్నించారు. 

రూపాయి కూడా రాష్ట్రప్రభుత్వం భరించదని, వ్యక్తిగతంగా జగన్మోహన్‌రెడ్డి తనసొంత నిధులే వాడుకోవాలన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్లు కొట్టేశారని... రూ.43వేలకోట్లు జప్తుచేయడమైందని, క్విడ్‌ప్రోకోతో లబ్దిపొందిన పారిశ్రామికవేత్తలు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని సీబీఐ తన అఫిడవిట్లలో స్పష్టంగా పేర్కొన్నదని రామయ్య వివరించారు. 

రూ.60లక్షలు ఖర్చవుతాయని కోర్టుకి తప్పుడుసమాచారం ఇచ్చినందుకు జగన్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. జగన్‌పై ఉన్న కేసులకు సంబంధించి విచారణకు హాజరుకావడానికి రాష్ట్రప్రభుత్వం ఐఏఎస్‌లకు డబ్బులు విడుదలచేస్తే, వాటిలో రూ.7లక్షల40వేలను ముగ్గురు ఐఏఎస్‌లు కొట్టేయడం దారుణమన్నారు. అటువంటి వ్యక్తులను జగన్మోహన్‌రెడ్డి తన సలహాదారులగా నియమించుకున్నారని, తనకు సంబంధించిన కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారన్నారు. 

read more రాస్కో చూస్కో అన్నారు, ఇప్పుడేమంటారు : బాబును నిలదీసిన మంత్రి అనిల్

ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో  మీడియాకు ముఖం చాటేశాడని వర్ల ఎద్దేవాచేశారు. పరిపాలనలో 6వనెలలోకి అడుగు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్క పత్రికా సమావేశం కూడా నిర్వహించకపోవడం విచిత్రంగా ఉందని వర్ల ఎద్దేవాచేశారు. ఆరునెలల పాలనలో ముఖ్యమంత్రి ప్రసారమాధ్యమాలతో మాట్లాడకపోవడం ఒక్క ఆంధ్రరాష్ట్రంలో తప్పదేశంలో ఎక్కడాజరగలేదన్నారు.

 ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డిపై ఛార్జ్‌షీట్లు వేసి 6 ఏళ్లయిందని, ఏదో ఒకవంకతో కేసులవిచారణ సజావుగా జరగకుండా ఆయన అడ్డుకుంటున్నాడని స్వయంగా సీబీఐ తన అఫిడవిట్‌లో  పేర్కొన్నదని, ఇది ఎంతవరకు న్యాయమో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని రామయ్య   డిమాండ్‌ చేశారు. ఆరేళ్లక్రితం జగన్‌పై సీబీఐ చార్జ్‌షీట్లు వేస్తే, ఇంతవరకు కేసులవిచార ణలో ఏవిధమైన పురోగతి లేకపోతే, జగన్‌ని కోర్టుకి హాజరుకాకుండా వదిలేస్తే ఆయనపై ఉన్న కేసులన్నీ ఏమవుతాయన్నారు. 

జగన్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి, కోర్టులపట్ల గౌరవం ఉన్నా, తన కేసుల విచారణ వేగవంతం చేయాలని, తప్పుచేస్తే శిక్షించాలని, లేకపోతే వదిలేయాలని కోరుతూ, సీబీఐకోర్టులో తనకుతానుగా ఆయన వెంటనే అఫిడవిట్‌ దాఖలు చేయాలని వర్ల హితవుపలికారు. రాష్ట్రముఖ్యమంత్రిగా ఆయన ఇన్నికేసులతో సతమతమవడం మంచిదికాదన్నారు. చిదంబరం కేసువిచారణ చూశాక, తనకేసుల్లో నుంచి జగన్మోహన్‌రెడ్డి తప్పించుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని టీడీపీనేత స్పష్టంచేశారు.  

click me!