బాబుపై ఐటీ ఆరోపణలు ప్రేరేపితం...ఆ సీబిఐ కేసులు మాత్రం వాస్తవం...: టిడిపి మాజీ ఎమ్మెల్యే

By Arun Kumar P  |  First Published Feb 14, 2020, 8:17 PM IST

ప్రతిపక్ష నాయకులు, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కావాలనే వైసిపి నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. 


గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ పై సీబీఐ కేసులు వాస్తవం, తెలుగుదేశం పార్టీపై ఐటీ ఆరోపణలు ప్రేరేపితమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంత్రి పదవులు పోతాయనే మంత్రులు ఒకరికిమించి మరొకరు అసత్యాలను ఏర్చికూర్చి ఆరోపణలు చేస్తున్నారని... అయినా తమ అధినేత చంద్రబాబును ఏమీ చేయలేరన్నారు. 

త్వరలోనే రూ.43వేల కోట్ల అక్రమ సంపాదన, 11 సీబీఐ,  5 ఈడీ కేసుల్లో ముద్దాయి జగన్ కు శిక్ష పడటం ఖాయమన్నారు. ఆయన ఆటలకు కట్టది పడటం తథ్యమన్నారు. ఊళ్ళో పెళ్ళికి కుక్కలా హడావుడీ అన్నట్లు వైసిపి మంత్రుల తీరు హాస్యాపదంగా ఉందంటూ అనిత  ఎద్దేవా చేశారు. 

Latest Videos

దేశంలో జరిగిన ఐటీ దాడులకు తెదేపా నేతలకు సంబంధ ఏమిటి..? అని  ప్రశ్నించారు..  పరువు నష్టం దావా కేసులు తేలడానికి ఎళ్ళ పడుతుందని... అందువల్లే   వైసిపి నేతలకు ఆడింది ఆట పాడింది పాటగా తయారైందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అసత్య ప్రచారాలనే జగన్ బృందం నమ్ముకుని రాజకీయాలు చేస్తుండటం హేయమన్నారు.  

అధికారంలోకి వచ్చినా అసత్య పునాదులపైనే వైసిపి వుందన్నారు. ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేయడం, సాక్షి పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వార్చడం  అలవాటుగా మారిందన్నారు. ఫ్యాక్షనిస్టు , అక్రమ సంపాదన పరుడు, అక్రమాస్తులను కూడగట్టుకుని 11 సీబీఐ కేసుల్లో ముద్దాయి సాక్షి వంటి మీడియా సంస్థలను నడుపుతున్న చరిత్ర  దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదంటూ విమర్శించారు. 

read more  బాబుపై కాదు కేసీఆర్ పైనే ఐటీ దాడులు...ఆ ఎనిమిదిమంది మంత్రులకోసమే...: దేవినేని ఉమ

రాజ్యాంగానికి, శాసన సభల వ్యవహారాల్లో, పోలీసు మాన్యువల్స్,  కోర్టు తీర్పులకు నిస్సిగ్గుగా, నిర్బీతిగా కొత్త భాష్యం చెప్పే వైసిపి తుగ్లక్ ల వ్యాఖ్యానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఐటీ దాడుల్లో ఎవరెవరి నుండి ఎంత మొత్తం స్వాధీనం చేసుకున్నారో స్పష్టంగా ఉంటె వైసిపి నేతలు మూర్ఖంగా టిడిపిపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. 

మాజీ ముఖ్యమంత్రిగా, టిడిపి అధ్యక్షునిగా ఉన్న చంద్రబాబు వద్ద పెద్ద సంఖ్యలో విధులు నిర్వర్తించే వ్యక్తులపై జరిగిన ఐటీ దాడులు జరిగితే టిడిపికి సంబంధం ఏమిటన్నారు. దేశం మొత్తం మీద 40 ప్రాంతాల్లో ఐటీ దాడుల్లో ఇన్ఫ్రా సంస్థల్లో లెక్కతేలని రూ. రూ.2 వేల కోట్ల వ్యవహారం ఏ ఒక్క వ్యక్తికో ఆపాదించి లేని అవినీతిని, తప్పును అంటగట్టడం ఎంతవరకూ సబబంటూ మండిపడ్డారు. 

ఇన్ఫ్రా సంస్థల్లో చూపుతున్న వ్యవహారంలో ఐటీ అధికారులు సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం అవసరమైతే కేసులు పెట్టడం సహజంగా జరుగుతుందన్నారు. చంద్రబాబును ఇబ్బందుల పాలు చేయాలని గతంలో  వైఎస్ రాజశే ఖరరెడ్డి  ఎన్ని కేసులు పెట్టి విచారించినా ఒక్కటీ రుజువు కాలేదన్నారు.

read more  వికేంద్రీకరణ బిల్లుపై క్లారిటీ లేదు... ఏం జరుగుతుందో చూద్దాం...: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు   

జగన్ సీబీఐ కేసుల నుంచి సీఎం జగన్ తప్పించుకోలేరని...సిబీఐ, ఈడీ ఆయనపై కేసులు పటిష్టంగా వున్నాయని అన్నారు. అవినీతి మరకలు టీడీపీకి, చంద్రబాబుకు అంటించాలని కుతంత్రం పని చేయదని... అయితే నిర్దోషిపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసిపి నేతలు త్వరలో ప్రజలకు ప్రజలకు క్షమాపణలు చెప్పక తప్పదన్నారు అనిత. 

 

 
 

click me!