మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మాజీ ఐటీ మంత్రి నారా లోకేశ్ స్నాక్స్ బిల్స్ పై వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేశాడని ఇటీవల వెలువడిన ఓ కథనం లోకేశ్ స్పందించారు.
అమరావతి: అక్రమాస్తుల పెట్టుబడులతో కట్టుకథలు అల్లేందుకు పుట్టిన విషపుత్రిక సాక్షి మీడియా అని మాజీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. ఆ సంస్ధ కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఏం చేయాలో తోచక మతి, నీతీలేని కథనాలతో తనపై దుష్ప్రచారం చేస్తోందని... దీన్ని ఆపకుంటే తగిన రీతిలో బుద్ది చెబుతామని లోకేశ్ హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో మంత్రి హోదాలో తాను కేవలం చిరుతిళ్ల కోసం రూ.25లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో తాను ఇలా చిరుతిళ్లకోసం భారీమొత్తాన్ని ఖర్చుచేసినట్లు ఓ కట్టుకథ అల్లి దాన్ని ప్రజలకు నమ్మించేందుకు సాక్షి మీడియా ప్రయత్నిస్తోందన్నారు. ఆ అసత్య కథనాలను నమ్మే పరిస్థితులు లేవన్నారు.
undefined
ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో పేర్కొన్న తేదీల్లో తాను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల పర్యటనలో వున్నట్లు తెలిపారు. తప్పుడు కథనాలు సృష్టించిన వారికి తప్పుడు ఆధారాలను కూడా ఎలా సృష్టించాలో తెలుసన్నారు.
గత ప్రభుత్వ ప్రోటోకాల్ ఖర్చును తాను చెల్లించాలని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా..? ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా..? చిల్లరకథనాలు అపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఉడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం ఈ నేరగాళ్ళు చేస్తున్నారన్నారు. సాక్షి తనపై బురద చల్లుతూ అలాంటి తప్పులనే చేస్తోందన్నారు.
ఉదాహరణకు 2018 ఫిబ్రవరి 4న తాను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096ల బిల్లు చేసినట్టు రాసారని తెతిపారు.ఇక అక్టోబర్ 30, 2018న తాను పొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరయితే ఆరోజు కూడా తాను విశాఖ ఎయిర్ పోర్టులో వున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో తాను రూ.79,170ల బిల్లు చేసినట్లు తెలిపారని గుర్తుచేశారు.
విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపిలందరి కోసం అయిన బిల్లుల్ని తన ఒక్కడి పేరునే వేసి ప్రచారంచేయడం సాక్షిలాంటి నీతిమాలిన మీడియాకే సాధ్యమైందన్నారు ఇలా ట్విట్టర్ వేదికన సాక్షి సంస్థపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ద్వజమెత్తారు.
తెదేపా అధికారంలో ఉండగా నేను విశాఖ ఎయిర్ పోర్టులో కూర్చుని చిరుతిళ్ళ కోసం రూ.25 లక్షలు ఖర్చుపెట్టేసానంటూ సాక్షి ఒక అసత్య కథనం వండి వార్చింది. ఆధారాల కోసం వాళ్ళు చూపించిన ఫుడ్ బిల్లులో ఉన్న తేదీల్లో నేను రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఉన్నాను. (2/5) pic.twitter.com/vPDO529MLE
— Lokesh Nara (@naralokesh)ఐదేళ్ల ఏపీసర్కారు ప్రోటోకాల్ ఖర్చు నాకు జమ వెయ్యమని దొంగబ్బాయ్ ఆర్డర్ వేసారా?ఇలాంటి నిరాధార కథనాలు రాసుకోడానికి సిగ్గుండక్కరలేదా? చిల్లరకథనాలు ఆపకపోతే మీ దొంగ పత్రిక బట్టలు ఊడదీసి ప్రజల ముందు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. (3/5)
— Lokesh Nara (@naralokesh)ఒక అబద్దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మరిన్ని అబద్దాలు అతికించే ప్రయత్నం చేస్తారు నేరగాళ్ళు. సాక్షి నాపై బురద చల్లుతూ అలాంటి తప్పులన్నిటినీ చేసింది. ఉదాహరణకు 2018 ఫిబ్రవరి 4న నేను న్యూజెర్సీలో ఉంటే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో రూ.67,096లు బిల్లు చేసినట్టు రాసారు. (4/5) pic.twitter.com/wnyDZGeEyM
— Lokesh Nara (@naralokesh)అక్టోబర్ 30, 2018న నేను ప్రొద్దుటూరులో ధర్మపోరాట దీక్షకు హాజరయితే ఆరోజు విశాఖ ఎయిర్ పోర్టులో అయిన రూ.79,170లు బిల్లును కూడా నా అకౌంట్లో వేశారు. విమానాశ్రయంలో ప్రభుత్వ విఐపిలందరి కోసం అయిన బిల్లుల్ని నా ఒక్కడి పేరునే వేసి ప్రచారం చేయడం సాక్షిలాంటి నీతిమాలిన మీడియాకే సాధ్యం. (5/5) pic.twitter.com/9DkqO29WNX
— Lokesh Nara (@naralokesh)