ప్రవర్తన సరిగా లేదని తల్లిని చంపిన తనయుడు

By AN Telugu  |  First Published Nov 11, 2020, 9:26 AM IST

గుంటూరు జిల్లా, నూజండ్లలో నవంబర్ 5న రాముడు పాలెం తండాలో భూక్యా సాలమ్మ బాయి హత్య తండాలో కలకలం రేపింది. అయితే కొడుకే ఈ హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. చిన్న కొడుకు కొండానాయక్ గొడ్డలితో నరికి తల్లిని హత్య చేసినట్లు తెలిపారు. 

సాలమ్మ భర్త నాన్యనాయక్ 9యేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. అయితే సాలమ్మ వీళ్ల దగ్గర ఉండకుండా తండా చివరన చిన్న ఇల్లు వేసుకుని అక్కడే ఒంటరిగా ఉంటోంది. 

Latest Videos

ఈ క్రమంలో తల్లి ప్రవర్తన సరిగా లేదని, పద్ధతి మార్చుకోవాలని కొడుకులు చాలాసార్లు చెప్పారు. అయినా సాలమ్మ వినలేదని ఓ సారి చేయికూడా చేసుకున్నారు. అయినా ఆమెలో మార్పు లేదు. ఆమెవల్ల అందరిముందు అవమానం అవుతుందని అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. 

ఈ నెల ఐదో తారీఖున తల్లి వేరే వాళ్లతో ఫోన్లో మాట్లాడడం చూసి కొండానాయక్ విపరీతమైన కోపంతో ఊగిపోయాడు. మంచంలో ఉన్న తల్లిని గొడ్డలితో నరికాడు. అంతటితో ఊరుకోకుండా బ్లేడ్ తో గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు అక్కడినుండి వెళ్లిపోయాడు.

హత్య విషయం తెలిసిన పోలీస్ విచారణ చేపట్టగా కొండానాయక్ ప్రవర్తన అనుమానంగా అనిపించి గట్టిగా ప్రశ్నించారు. దీంతో కొండానాయక్ తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. అతని నుండి ఆయుధాలు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేశారు. కోర్టులో రిమాండ్ విధించారు. 

click me!