గుంటూరులో ప్రేమ పేరుతో దారుణం.. రెండేళ్ల తరువాత...

By AN Telugu  |  First Published Nov 9, 2020, 3:14 PM IST

నెల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు యువతులు ప్రేమ పేరుతో హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరులో ప్రేమపేరుతో యువతిని హత్య చేసిన ఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది. 


నెల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు యువతులు ప్రేమ పేరుతో హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరులో ప్రేమపేరుతో యువతిని హత్య చేసిన ఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది. 

గుంటూరు ఆలీనగర్‌లో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు అతి దారుణంగా హత్య చేశాడు. పూర్తి వివరాల్లోకెళితే.. 2018లో నజీమా అనే యువతి అదృశ్యమైంది. పెళ్లికని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన నజీమా తిరిగి ఇంటికి రాలేదు. 

Latest Videos

దీనిమీద అప్పట్లోనే పాత గుంటూరు స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులు పోలీసులు తీవ్రంగా వెతికినా దొరకకపోవడంతో పోలీసులు కేసును వదిలేశారు.

అయితే తాజాగా యువతి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో నజిమా తల్లిదండ్రులు ఐజీని కలిసి నాగూర్‌ అనే యువకుడిపై ఫిర్యాదు చేశారు. ఐజీ ఆదేశాలతో నాగూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. ప్రేమ పేరుతో నజిమాను మోసం చేసి, హత్య చేసినట్లు నాగూర్‌ ఒప్పుకున్నాడు. 

రెండేళ్ళ క్రితం జరిగిన ఈ ఘటన ఇవాళ వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న నజీమా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

click me!