రాజధానిపై జగన్ ప్రకటన... రాష్ట్రమే మూడు ముక్కలయ్యే ప్రమాదం: రావెల ఆగ్రహం

By Arun Kumar P  |  First Published Dec 19, 2019, 9:24 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని మార్చాలన్న నిర్ణయాన్ని జగన్ ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సూచించారు.  ఇలా రాజధాని పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయడం తగదన్నారు.  


అమరావతి: అమరావతి అనేది ఐదు కోట్ల ఆంధ్రుల ఆస్తి అని మాజీమంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ప్రపంచంలో ప్రఖ్యాత ఆర్కిటెక్చరర్స్ సాయంతో మొదలుపెట్టిన రాజధాని అమరావతి నిర్మాణాన్ని అర్థాంతరంగా ఆపేయడం తగదన్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. 

సీఎం జగన్ తొందరపడి రాజధానిపై నిర్ణయం తీసుకున్నారని... ప్రజాభిప్రాయానికి తలొగ్గి తన నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలన్నారు. రాజధాని పేరుతో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలనే ఆయన ఆలోచన ముగ్గురు బిడ్డల్ని నరకడమంత పాపం లాంటిదని రావెల మండిపడ్డారు. 

Latest Videos

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోయాక ఇక్కడ రాజధాని కోసం రైతులు 30 వేల ఎకరాలు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ రైతుల పాలిట శాపంలా తయారయ్యిందన్నారు.

read more జగన్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ... త్వరలోనే 'రంగు'పడుద్ది: వర్ల రామయ్య

రైతులు వేల ఎకరాలు త్యాగం చేసి ఇచ్చిన ఈ ప్రాంతాన్ని బొత్స స్మశానంతో పోల్చండం ఏంటి..?  అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇదీ అని చెప్పుకోడానికి లేకుండా వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా  వ్యవహరిస్తోందని... ఇంతకంటే  సిగ్గు చేటు మరోటి వుండదన్నారు. 

తాను ఇక్కడే పుట్టి పెరిగానని... తమ ప్రాంతాల్లో రాజధాని రావడం, శంకుస్థాపన చెయ్యడం అదృష్టంగా భావించానన్నారు. కానీ ఇక్కడి ప్రజల బ్రతుకు అందకారంగా మారే పరిస్థితి వచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని అన్నారు. 

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఏపిలో విదేశీ సంస్థలే కాదు స్వదేశీ వ్యాపారులు కూడా పెట్టుబడి పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. అందుకు వైసీపీ ప్రభుత్వం అనాలోచిన నిర్ణయాలేనని మండిపడ్డారు.

read more  జగన్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ... త్వరలోనే 'రంగు'పడుద్ది: వర్ల రామయ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సాయపడతాం అని కేంద్రం చెప్తూ వున్నా...వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో 12 లక్షల ఇళ్ళని మంజూరు చేసిన ఘనత కేంద్ర బీజేపీదని అన్నారు. 

రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దారుణంగా పడిపోవడానికి కారణం జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. రాష్ట్రంలో  ఇసుక ,నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని అన్నారు. ముఖ్యంగా విరివిగా లభించే ఇసుకు బ్లాక్ మార్కెట్ ఎక్కువగా తరలిపోతోందని...అందువల్లే కొరత ఏర్పడిందన్నారు. జగన్ కు ఎవరిపైన అయినా రాజకీయ కక్షలు ఉంటే వారితో చూసుకోవాలి కానీ ప్రజలపై చూపడం సరికాదని రావెల సూచించారు. 


 

click me!