యూట్యూబ్ మరో నేరానికి కారణమయ్యింది. దొంగతనం చేయడమెలా అని యూ ట్యూబ్ లో వీడియోలు చూసిన ఇద్దరు యువకులు ఏకంగా బ్యాంకుకే కన్నం వేశారు. 77 లక్షల నగదును చోరీ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గుంటూరు పోలీసులు 72 గంటల్లో నిందితుల్ని పట్టుకున్నారు.

ఎస్పీ విశాల్ గున్నీ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకి చెందిన ఇద్దరు వ్యక్తులు కేదారి ప్రసాద్, వినయ్ రాములు గుంటూరు, దాచేపల్లిలోని ఎస్.బి.ఐ లో 77 లక్షలు దోచుకెళ్ళారు. పోలీసు కుక్కలు గుర్తుపట్టకుండా పనిపూర్తైన తర్వాత పరిసరప్రాంతాల్లో కారం చల్లి వెళ్ళిపోయారు.
దీంతో సంబంధిత బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..రూరల్
పోలీసులు 8 బృందాలుగా రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 72 గంటల్లో 77 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును చేధించడంలో ప్రతిభ కనబర్చిన తమ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్నీ ప్రత్యేకంగా అభినందించారు.
నిందితులు ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు దొంగతనం చేయడం ఎలా ? అని యూట్యూబ్ వీడియోలు చూసి ఈ దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి ఆశ్చర్యపరిచారు.