క్రికెట్ బెట్టింగ్ ప్రాణాలు తీసింది.. పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో...

By AN Telugu  |  First Published Nov 11, 2020, 3:31 PM IST

క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో బెట్టింగ్ డబ్బులు కట్టలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగ, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.


క్రికెట్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో బెట్టింగ్ డబ్బులు కట్టలేక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగ, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెడితే పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్‌, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్ష రూపాయలు పొగొట్టుకున్నారు. 

Latest Videos

బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించారు. మరో రూ.80 వేల కోసం ఇవ్వాల్సి ఉంది. ఇవి వెంటనే ఇవ్వాలంటూ నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

పురుగుల మందు తాగేముందు తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. వీడియో చూసిన వెంటనే బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని గుంటూరు ప్రైవేటు అస్పత్రికి తరలించారు. 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

click me!