ప్రైవేట్ ట్రావెల్స్ పై దాడులు మరింత ముమ్మరం: రవాణా మంత్రి పేర్ని నాని

By Arun Kumar PFirst Published Jan 17, 2020, 4:49 PM IST
Highlights

సంక్రాంతి పండగ రద్దీని అదునుగా చేసుకుని అధిక ఛార్జీలను వసూలుచేసి ప్రజలను దోచుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా మంత్రి పేర్ని నాని తెలిపారు. 

అమరావతి: సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులను నుండి అధిక ఛార్జీలు వసూలు చేసిన ప్రైవేట్  ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటున్నామని రవాణశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్స్ పై దాదాపు 3172 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 546బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేశామని తెలిపారు. వాట్సాప్ ద్వారా చాలా ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయని... వాటి ఆధారంగా కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వరంగ  సంస్థ ఆర్టీసీ ద్వారా 3 లక్షల 19 వేల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చినట్లు తెలిపారు. 

read more  విజ్ఞాన్ రత్తయ్యకు విశిష్ట అవార్డు... ప్రకటించిన యార్లగడ్డ

ప్రైవేటు రవాణా సంస్థలు ఉల్లంఘనలు లేకుండా కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. కొన్ని రూట్లలో అధిక ధరలు వసూలు చేసినట్టు ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని... కాబట్టి ఈ నెల 20వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులపై తనిఖీ లు కొనసాగిస్తారని అన్నారు.

పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలో ఫిర్యాదులు ఉన్నా వాట్సాప్ నెంబర్ ద్వారా తమ దృష్టికి  తీసురావాలని సూచించారు. 8309887955  నంబర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్ని నాని స్పష్టం చేశారు.
 

click me!