పేద విద్యార్థులు, ఇంగ్లీషు మీడియం అభ్యసించడాన్ని తెలుగుదేశంపార్టీ వ్యతిరేకిస్తోం దని దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేముందు విద్యా వ్యవస్థలో చేయాల్సిన మార్పులు, చేపట్టాల్సిన సంస్కరణలపై దృష్టిపెట్టాలని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి నక్కా ఆనందబాబు హితవుపలికారు.
సోమవారం ఆయన గుంటూరులో పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్‌ల పిల్లలు ఎక్కడచదివారని ప్రశ్నిస్తున్న జగన్మోహన్‌రెడ్డి, తనపిల్లలు లండన్‌లో చదువుతున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
జీవో-81ద్వారా ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై అమితాసక్తి చూపుతున్న జగన్‌సర్కారు, ముందుగా ఆంగ్లాన్ని అర్థంచేసుకు నేస్థాయిలో విద్యార్థులున్నారా... వారికి అర్థమయ్యేరీతిలో సులభతరంగా బోధించేలా ఉపాధ్యాయుల బోధనాస్థాయి ఉందోలేదో ఆలోచించాలన్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దకుం డా, వాస్తవాలను గ్రహించకుండా ప్రతిఅంశంలో ప్రతిపక్షంపై విషప్రచారం చేయడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని నక్కా మండిపడ్డారు. 2017లో రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతివరకు ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నానాయాగీచేసిన వైసీపీ, వెనకా ముందూ ఆలోచించకుండా ఇప్పుడెలా ఆంగ్లబోధన అమలుచేస్తోందని, ప్రభుత్వ నిర్ణయాన్ని సాక్షి మీడియా గుడ్డిగా ఎలాసమర్థిస్తోందని నక్కా ప్రశ్నించారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలుగుదే శం ప్రభుత్వనిర్ణయానికి వ్యతిరేకంగా ఆనాడు బట్టలు చించుకొని, నేడు నోరెత్తనిస్థితిలో ఉన్నాడని నక్కా దెప్పిపొడిచారు. నాడు తెలుగుదేశం నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాషాసం ఘాలు, ప్రజాసంఘాలు నేడుభయంతో స్పందించడం లేదన్నారు. కూలీనాలీ చేసుకునేవార తా తమపిల్లలను ప్రభుత్వపాఠశాలల్లోనే చదివిస్తారని, ఆయా విద్యార్థులకు ఆంగ్లాన్ని బోధించడాన్ని తెలుగుదేశంపార్టీ తప్పుపట్టడంలేదని, వారిలోని మేథాశక్తిని పెంపొందిం చకుండా, బలవంతంగా ఆంగ్లవిద్యాబోధన అమలుకు పూనుకోవడం సరికాదన్నారు.
ఆంగ్లబోధనవల్ల పాఠశాలల్లో డ్రాపవుట్స్ పెరగకుండాచూసి, ఇంగ్లీషుమీడియానికి సమాంతరంగా తెలుగుమీడియాన్ని కూడా ప్రభుత్వపాఠశాలల్లో అమలుచేయాలని ఆనందబాబు డిమాండ్‌చేశారు. రాష్ట్రంలోని జిల్లాపరిషత్ పాఠశాలల్లో 6వతరగతి నుంచి ఇంగ్లీషుమీడియం అమలవుతోందని, మున్సిపల్ పాఠశాలల్లో కూడా అమలుచేయడానికి 2017లోనే జీవో ఇచ్చామని, రాష్ట్రప్రభుత్వం కొత్తగా చేస్తున్నదేమీ లేదన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేం దుకు గతంలోనే తెలుగుదేశంప్రభుత్వం గురుకులాలు ఏర్పాటుచేసి, ఇంగ్లీషు మీడియంలో బోధన అమలుచేసిందన్నారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులపై ప్రభుత్వం కొత్తగా ప్రేమచూపిస్తున్న ట్లు నటిస్తోందన్నారు. ఇంగ్లీషు అర్థంకాని విద్యార్థులు తెలుగుభాషను ఎంచుకునేలా వారికి అవకాశమివ్వాలని, ఆంగ్లాన్ని బోధించేలా ఉపాధ్యాయులకు తగినవిధంగా శిక్షణ ఇవ్వాలని నక్కా సూచించారు.
ఆప్షనల్‌సబ్జెక్ట్‌గా సంస్కృతం స్థానంలో విధిగా తెలుగునే అమలుచేయాలన్నారు. ఇంగ్లీషు ఆవశ్యకతను గుర్తిస్తూనే తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిపై, పాలకులపై ఉందన్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంద్వారా మతమార్పిళ్లు ప్రోత్సహిస్తున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, భాషకు మతానికి ఏవిధమైన సంబంధంలేదని, వ్యక్తిగతంగా ఆ అభిప్రాయంతో తాను ఏకీభవించనని ఆనందబాబు తేల్చిచెప్పారు.