సచివాలయ రాత పరీక్షలు రద్దు చేయాలని జగన్ కు చంద్రబాబు లేఖ

By narsimha lodeFirst Published Sep 22, 2019, 4:56 PM IST
Highlights

గ్రామ సచివాలయ పరీక్షలపై ఏపీ సీఎం జగన్ కు బాబు ఆదివారం నాడు లేఖ రాశారు. 

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆదివారం నాడు లేఖ రాశారు. గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరగడం వైఎస్ఆర్‌సీపీ  పాలనకు కారణమని ఆయన విమర్శలు గుప్పించారు.

 

 

 

అనుభవ రాహిత్యం, ఆశ్రిత పక్షపాతం, కక్ష సాధింపు ధోరణితో నాలుగు నెలలుగా జగన్ పాలన సాగిస్తున్నాడని చంద్రబాబునాయుడు విమర్శించారు.గ్రామ సచివాలయ పరీక్ష ఫలితాలు  ఏపీపీఎస్‌సీ ప్రతిష్టకే మాయని మచ్చను తెచ్చిందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

దాదాపుగా 19 లక్షల మంది అభ్యర్ధులతో పాటు ఆ కుటుంబాలకు  ఫలితాలు వేనను మిగిల్చాయన్నారు.ఏపీపీఎస్‌సీ కంటే ముందే రిటైర్డ్ అధికారి, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. నష్టపోయిన అభ్యర్ధులకు సమాధానం చెప్పాలని చంద్రబాబు కోరారు.

ఈ పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలన్నారు. అంతేకాదు ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. 
 

click me!