చైనాలోని కరోనా వైరస్ కన్నా.. ఏపీలోని ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరమని మంత్రి నాని సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని పలువురి పింఛన్లను తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు నాని
చైనాలోని కరోనా వైరస్ కన్నా.. ఏపీలోని ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరమని మంత్రి నాని సెటైర్లు వేశారు. రాష్ట్రంలోని పలువురి పింఛన్లను తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు నాని.
అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 39 లక్షల మందికి పెన్షన్లు అందేవని.. జగన్ సీఎం అయ్యాక 54 లక్షల మందికి అందుతున్నాయని వెల్లడించారు.
Also Read:నారావారిపల్లెలో ఉద్రిక్తత: ఎమ్మెల్యే చెవిరెడ్డి సభ, టీడీపీ నిరసన
ఇంటి వద్దకు పెన్షన్లు అందిస్తూ వైసీపీ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోందని నాని పేర్కొన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా తదితర సంక్షేమ పథకాలతో కోటి మందికి పైగా తమ ప్రభుత్వం ఆర్ధిక సాయం చేసిందని నాని గుర్తుచేశారు.
పెన్సన్ల కోసం వృధ్దులు, వికలాంగులు ఇబ్బందులు పడవద్దని జగన్ భావించారని.... అందుకే పెన్సన్లను ఇంటి వద్దకే అందించే కార్యక్రమం చేపట్టారని నాని తెలిపారు. పెన్షన్లు తగ్గించారన్న చంద్రబాబు ఆరోపణలు అవాస్తవమని, ప్రభుత్వంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ,రామోజీరావు, రాధాకృష్ణలకు పెన్షన్ రాకపోతే రాష్ట్రంలో ఎవరికీ పెన్షన్ రానట్లా అని మంత్రి నిలదీశారు. చంద్రబాబు పాలనలో టిడిపి కార్యకర్తలకే పెన్షన్లు వచ్చేవని ఆయన దుయ్యబట్టారు.
జేసి దివాకరరెడ్డికి వయస్సు వచ్చింది కాని బుధ్దిరాలేదని, ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా జేసీ అడ్డగోలుగా బస్సులను నడుపుతున్నారని.. జగన్‌ను విమర్శించే స్థాయి జేసీకి లేదని మంత్రి ఎద్దేవా చేశారు.
Also Read:చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు
మూడు రాజధానులకు వ్యతిరేకంగా కేవలం 29 గ్రామాల్లోనే ఉద్యమం నడుస్తోందని... వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని నాని స్పష్టం చేశారు. బిజేపితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని కొడాలి నాని ప్రశ్నించారు.
యనమలకు మైండ్ పనిచేయడం లేదని, గతంలో బీజేపీతో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు యనమల రాష్ట్రానికి నిధులు ఎందుకు తీసుకురాలేదని నాని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తారని, కేంద్రమంత్రులను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరిస్తారని మంత్రి వెల్లడించారు.