బడ్జెట్ లో ఏపికి మొండిచేయి... జగన్ డిల్లీ పర్యటనల వెనక రహస్యమిదే..: కళా వెంకట్రావు

By Arun Kumar PFirst Published Feb 1, 2020, 6:49 PM IST
Highlights

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని... దీనికి ముఖ్యమంత్రి జగన్ అసమర్థతే కారణమని టిడిపి నాయకులు కళా వెెంకట్రావు మండిపడ్డారు. 

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. అధికారాన్ని చేపట్టిన నాటినుండి కేవలం వారిపై వున్న కేసుల మాఫీతో పాటు స్వప్రయోజనాల కోసమే డిల్లీకి వెళ్లారన్నది ఈ బడ్జెట్ లో ఏపికి జరిగిన కేటాయింపులను బట్టే అర్ధమవుతోందన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడ్డారా? అని ప్రశ్నించారు.  ఏ పని అయినా కేంద్రానికి చెప్పే చేస్తున్నాం... కేంద్రం మన రాష్ట్రాన్ని ఆదుకుంటుందని చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి ఉందని బడ్జెట్‌ ముందు వరకు హోరెత్తించారని... ఇప్పుడు ఏమయ్యిందని ఆయన నిలదీశారు. 

read more  కొన్ని బాగున్నాయి, కానీ ఏపీకి నిరాశే: కేంద్ర బడ్జెట్‌పై బుగ్గన స్పందన

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందంటూ విజయసాయిరెడ్డే మొసలి కన్నీరు కారుస్తుండటం ఆశ్యర్యాన్ని కలిగించిందన్నారు. 22 మంది ఎంపీలను ఉంచుకొని కేంద్రం మెడలు వంచటమంటే ఇదేనా? అంటూ ఎద్దేవా చేశారు.

2020-21 కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేకహోదా, వెనకబడిన జిల్లాలకు నిధులు సహా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశం కూడా లేదంటే అది జగన్‌ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ఏపీకి ఒక్కంటే ఒక్కటి కూడా కొత్త రైల్వే ప్రాజెక్టు సాధించలేకపోయారని మండిపడ్డారు.

read more  జగన్ వల్లే ఏపీకి సున్నా.. కేంద్ర బడ్జెట్ పై యనమల కామెంట్స్

13 జిల్లాలకు జీవనాడైనా పోలవరానికి ఒక్క రూపాయి నిధులు రప్పించుకోలేకపోయారని ఆరోపించారు. విశాఖలో భూములు కబ్జాపై, ప్రతిపక్ష నేతలు, ప్రజలను అణచివేయడానికే తమ సమయమంతా జగన్‌ ప్రభుత్వం కేటాయిస్తుందని బడ్జెట్‌ కేటాయింపుల్లో స్పష్టమైందని కళా వెంకట్రావు విమర్శించారు.  
 

click me!