ఆ పాపం ప్రజలదే... అందుకు వారే బాధితులు...: వర్ల రామయ్య వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Feb 18, 2020, 12:43 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తీసుకున్న తప్పుడు నిర్ణయమే ఇప్పుడు వారిని బాధితులుగా మార్చిందని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య తెలిపారు. 

గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పజెప్పి రాష్ట్రాన్ని ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చిన పాపం ప్రజలదేనంటే టిడిపి సీనిచర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకులను ఎన్నుకునే సమయంలో జాగ్రత్తగా వుండాల్సిన ప్రజలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చి అదే ప్రజలను బాధితులను చేస్తాయని... ఇప్పుడు ఏపిలో అలాంటి పరిస్థితులే వున్నాయన్నారు.

''సమదృష్టి లేని పాలకులను ఎన్నుకున్న పాపం ప్రజలదే. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఆ పాలకులను అతి జగరూకతతో ఎంపిక చేసుకోవలసిన బాధ్యత ప్రజలదే. ఆ బాధ్యత నిర్వహణలో ప్రజకు ఏమరపాటు తగదు. అప్రమత్తంగా లేకపోతే ఎంచుకున్న ప్రజలే బాధితులౌతారు. తప్పు చిన్నది-మూల్యం పెద్దది. వర్తమానం గుర్తించండి'' అంటూ రామయ్య రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

read more  తల్లీ, చెల్లీ వల్లే జగన్ కు సీఎం పీఠం... కానీ ఇప్పుడు...: వంగలపూడి అనిత

మంత్రి బొత్స సత్యనారాయణ చిత్రవిచిత్రంగా మాట్లాడుతుంటారని... తన మాటలకు తానే వింతభాష్యాలు చెప్పడం కూడా ఆయనకు ఒక అలవాటని, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తేనే ఆయన దేనయినా నమ్ముతాడని రామయ్య ఎద్దేవా చేశారు. వైసిపి ఎన్డీఏలో చేరడంపై మాట్లాడుతూ... అవసరమైతే ఎవరికాళ్లు, గడ్డాలైనా పట్టుకుంటామన్నారని స్వయంగా మంత్రి  బొత్స సత్యనారాయణ స్పష్టంగా చెప్పాడని రామయ్య తెలిపారు. 
 
ఇలా మాట అనడం  తర్వాత దానిపై వెనక్కు పోవడం బొత్సకు ఎప్పటినుంచో ఉన్న అలవాటేనన్నారు. మైనారిటీలు తమ ప్రభుత్వాన్ని ఛీకొడతారన్న భయంతో, ముస్లింలను మభ్యపెట్టడంకోసం బొత్స, వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గాయన్నారు.  

అవినీతి పార్టీని వదిలిపెట్టనని గతంలో చెప్పిన బొత్స ఇప్పుడు అదేపార్టీలో ఉంటూ ఇతరులపై బురదజల్లాలని చూస్తున్నాడన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తాగని రోజుందా.. అని, తానే వైఎస్‌ కు బ్రాందీ పోసినట్లుగా మాట్లాడిన బొత్స ఇప్పుడు అదే వైఎస్‌పేరుతో ఉన్న పార్టీలో ఎలా ఉంటున్నాడో చెప్పాలన్నారు.  షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ గురించి కూడా బొత్స నోరుపారేసుకున్నాడన్నారు. 

read more  ఏడాదిని రూ.20వేల కోట్ల అక్రమార్జన...: జగన్ పై మాజీ మంత్రి ఆరోపణలు

కోట్లు దోచుకున్న జగన్‌ని జాతిపితతో ఎలా పోలుస్తారంటూ గతంలో మండిపడిన బొత్స ఇప్పుడు అదే జగన్‌ మంత్రివర్గంలో ఎలా కొనసాగుతున్నాడో చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. బొత్సకంటే రోజూ బ్రాందీతాగేవారే నయమని... వారు అప్పుడప్పుడైనా మాటపై నిలబడతారని రామయ్య  దెప్పిపొడిచారు. 

 బొత్స తన ఆస్తుల వివరాలు ప్రకటించాలని...  రాజకీయాల్లోకి రాకముందు ఆయనకున్న ఆస్తులెన్నో చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు.  తెల్లారేసరికి ఆస్తులు అమాంతం రెట్టింపు ఎలా అవుతాయో, రాజకీయాల్లో డబ్బులు కొట్టేయడం ఎలా అనే అంశాలపై బొత్స ఒక పాఠశాల నడిపితే బాగుంటుందని వర్ల హితవుపలికారు. 

తిన్నింటివాసాలు లెక్కపెట్టేలా బొత్స వైఖరిఉందని, ఆయన బాటలోనే  మంత్రి అనిల్‌కుమార్‌ కూడా నడుస్తున్నాడన్నారు. చంద్రబాబు జైలుకెళతాడంటున్న ఉమ్మారెడ్డి ముందు జైలుకెళితే, ఆయనవెనక ఇతరులు వస్తారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వయోవృద్ధుడైన ఉమ్మారెడ్డి కూడా మతిలేకుండా మాట్లాడితే ఎలాగన్నారు వర్ల రామయ్య.      


 

click me!