రైతు భరోసా జాబితాలో నా పేరెలా చేరిందంటే..: ఆదిమూలపు సురేష్

By Arun Kumar P  |  First Published Oct 11, 2019, 2:41 PM IST

రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో తన పేరెలా చేరిందో మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఇందులో తప్పెవరిదో ఆయన తెలియజేశారు.  


అమరావతి: రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో తన పేరు వుండటంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. ఈ జాబితాలోకి తన పేరున్న మాట వాస్తవేమనని... కానీ అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు.

''ఇవాళ(శుక్రవారం) ఉదయం నుండి రైతు భరోసా పథక లబ్దిదారుల జాబితాలో నా పేరు ఉందన్న ప్రచారం జరుగుతోంది. నేను కూడా వార్తాప్రసారాల ద్వారానే దీని గురించి తెలుసుకున్నారు. నా దృష్టికి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని ప్రకాశం వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను.

Latest Videos

ఈ జాబితాను రూపొందించే సాఫ్ట్‌వేర్‌లో ప్రజా ప్రతినిధుల కాలం లేదు. అందువల్లే అర్హుల జాబితాలో నా పేరు వచ్చిందని సదరు అధికారి  వివరించారు.  దీంతో వెంటనే ఆ జాబితాలో నుండి నా  పేరు తొలగించాలని ఆదేశించాను.'' అని మంత్రి వివరించారు.

ఈ పథకం రైతులకు మేలు చేసే విధంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. రైతుబిడ్డగా నాకు వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. కానీ ఈ పథకం అర్హులకే దక్కాలని మా ప్రభుత్వం కోరుకుంటోంది.  

ఇంకా అర్హుల జాబితాలో ఎవరైనా ప్రజాప్రతినిధుల పేర్లు  వచ్చి ఉంటే వాటన్నిటినీ పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సమస్యను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళానని తెలిపారు.

సంబంధిత వార్త

 

click me!