రాజధాని కోసం జోలెపట్టిన చంద్రబాబు... రూ.50 కోట్ల సేకరణ: కన్నబాబు సెటైర్లు

By Arun Kumar P  |  First Published Jan 10, 2020, 5:22 PM IST

రాజధాని అమరావతి ఉద్యమం కోసం జోలెపట్టి నిధుల సేకరణ చేపట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై  మంత్రి కురసాల కన్నబాబు సంచలన ఆరోపణలు చేశారు. 


విజయవాడ: రాజధాని రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. వైసిపి ప్రభుత్వంపై అమరావతి ప్రజలకు లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతున్నారని అన్నారు.  ఇలా వారిలో ప్రభుత్వ నిర్ణయంపై అపోహలు కల్పించి గందరగోళం సృష్టించి నిరసనలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారని మంత్రి ఆరోపించారు. 

రాష్ట్ర ప్రజల మనోభావాలను గుర్తించే హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, జీఎన్ రావు కమిటీ నివేదికలను పరిగణనలోకి తీసుకుని వాటిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. వాటి ఆధారంగానే తమ నిర్ణయముుంటుందని... మరిన్న సమావేశాల అనంతరం రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Latest Videos

read more  అమరావతి నిరసనల్లో విషాదం... గుండెపోటుతో మహిళ మృతి

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మించారా అని కన్నబాబు నిలదీశారు. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును చంద్రబాబుతో సహా ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. 

చంద్రబాబు గతంలో కూడా జోలే పట్టి దాదాపు రూ.50 కోట్లు రాజధాని నిర్మాణం కోసం అంటూ సేకరించారని... ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు అంటూ ప్రజల జేబుల్లో డబ్బులు లాక్కునేందుకు  ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  గతంలో అమరావతి కోసం సేకరించిన నిధులు ఏమయ్యాయని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. 

read more  కృష్ణా-గుంటూరు జిల్లాలు నిర్లక్ష్యమయ్యాయి: హైపవర్ కమిటీ భేటీలో మంత్రుల వ్యాఖ్యలు

చంద్రబాబు గతంలో కూడా జోలే పట్టి దాదాపు రూ.50 కోట్లు రాజధాని నిర్మాణం కోసం అంటూ సేకరించారని... ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు అంటూ ప్రజల జేబుల్లో డబ్బులు లాక్కునేందుకు  ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  గతంలో అమరావతి కోసం సేకరించిన నిధులు ఏమయ్యాయని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. 

ఏపీ రాజధాని తరలింపు, పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనానికి ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం మరోసారి సమావేశమైంది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో జిల్లాల వారీ అభివృద్ధి రూపకల్పన, టైమ్‌లైన్ ఫిక్స్ చేయాలని కమిటీ అభిప్రాయపడింది. 

రాజధాని పేరుతో కృష్ణా-గుంటూరు జిల్లాలు నిర్లక్ష్యమయ్యాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బందరుపోర్ట్ నిర్మాణ, పూర్తి చేసే తేదీలను ప్రకటించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. అలాగే గుడివాడను గత ప్రభుత్వం గ్రీన్‌జోన్‌గా ప్రకటించడంతో అభివృద్ధి ఆగిందని మంత్రి కొడాలి నాని అభిప్రాయపడ్డారు. 

అమరావతిలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని హైపవర్ కమిటీ అభిప్రాయపడింది. అసెంబ్లీ పేరుతో సరిపెడితే అమరావతి సాధ్యం కాదని మంత్రులు భావిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు మినహా ఇతర పరిశ్రమలు పెద్దగా రాలేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అలాగే అమరావతి నుంచి విశాఖకు ఉద్యోగుల తరలింపు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులపై కమిటీ చర్చించింది. 

రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందని కమిటీ అభిప్రాయపడింది. మూడు రాజధానుల విషయంలో మెజార్టీ అంశాలపై, ఈ నెల 13వ తేదీన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 

click me!