జగన్ పై పొగడ్తలు: విజయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు

Published : Oct 09, 2019, 02:26 PM ISTUpdated : Oct 09, 2019, 02:55 PM IST
జగన్ పై పొగడ్తలు: విజయ్ కుమార్ కు అదనపు బాధ్యతలు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో ఐఎఎస్, ఐపిఎస్ ల బదిలీలు జరిగాయి. పలువురికి స్థానచలనం కల్పించి ఇతర శాఖలను అప్పగించగా కొందరికి  అసలేమి అప్పగించకుండా సంబంధిత కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదీలలను చేపట్టింది. ఈ బదీలీల్లో భాగంగా కొంతమందికి పోస్టింగ్ ఖరారు చేయగా మరికొందరికి సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి కూడా ప్రకటన వెలువడింది. 

జియ‌స్ఆర్‌కే విజ‌య్ కుమార్ కు మున్సిప‌ల్ శాఖ క‌మీష‌నర్ తో పాటు ప్లానింగ్ కార్య‌ద‌ర్శి, సిఈవో గా పూర్తి స్థాయి అద‌న‌పు భాద్య‌త‌లను అప్పగించారు. ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పరిపాలనలో అతడి ప్రాధాన్యత పెరగడం చర్చనీయాంశంగా మారింది.

సుమిత్ కుమార్ కు ఏపి ఫైబ‌ర్ నెట్ ఎండితో పాటు ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, మౌళిక స‌దుపాయ‌ల కామ‌ర్స్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయి అద‌న‌పు భాద్య‌త‌లు  అప్పగించారు.అలాగే ఇసుకకు సంబంధించిన వ్యవహాల పర్యవేక్షణను కూడా ఆయనకే అప్పగించారు. 

ఎం హ‌రినారాయ‌ణ్ కు సిసిఎల్ స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ తో పాటు పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ‌కు ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి గా పూర్తి స్థాయి అద‌న‌పు భాద్య‌త‌లు అప్పగించారు. అంతేకాకుండా ప్ర‌త్యేకంగా గ్రామ‌స‌చివాల‌యాలు, గ్రామ‌వాలంటీర్స్ శిక్ష‌ణ భాద్యతను కూడా  ఆయనకే అప్పగించారు. 
 
వి. కోటేశ్వ‌ర‌మ్మను ప్లానింగ్ డిపార్ట్మెంట్ డిఫ్యూడి కార్య‌ద‌ర్శి నియమించారు. సంజ‌య్ గుప్తా ను సిసిఎస్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇలా పరువురికి స్థానచలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించారు.  

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా