గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన కొడుకు ఉద్యోగం పోయిందన్న మనస్థాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
గుంటూరు ముప్పాళ్ళలో మండలం పలుదేవర్లపాడు గ్రామానికి మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన కొడుకును ఉద్యోగం నుండి తొలగించారని మనస్థాపానికి గురయిన మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
పలుదేవర్లపాడు గ్రామానికి చెందిన రమేష్ (33)ను విద్యుత్ సబ్ స్టేషన్ ఉద్యోగం చేసేవాడు. అతన్ని ఇటీవలే ఉద్యోగం నుండి తొలగించారు. దీన్ని తట్టుకోలేకపోయిన ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
గత ప్రభుత్వంలో ముప్పాళ్ళ విద్యుత్ సభ్ స్టేషన్ లో అపరేటర్ గా ఉద్యోగం చేరిన రమేష్ ..ఇటివల వైఎస్సార్ పార్టీ నాయకులు రమేష్ ను బలవంతంగా విధులనుంచి తొలగించారు. ఆ స్థానంలో మరోకరిని నియమించారు అధికారులు.
అధికారుల నిర్వహకంపై కోర్టు అశ్రయించారు రమేష్. దీంతో అతన్నివిధులోకి చేర్చుకోవాలంటు కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇలా కోర్టు ఉత్త్వరులు ఇచ్చిన కొడుకును విధులోకి తీసుకోవటంపై తల్లి సువార్తమ్మ తీవ్ర మస్తాపానికి గురయ్యింది. పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.