విద్యార్ధినిని హోటల్‌కు తీసుకెళ్లిన ఆర్మీ ఉద్యోగి: దిశ యాప్‌ ద్వారా భార్య ఫిర్యాదు

By Siva Kodati  |  First Published Mar 2, 2020, 10:10 PM IST

తాడేపల్లికి చెందిన అనిల్ అనే రైల్వే ఉద్యోగి యువతిని మాయమాటలతో హోటల్‌కు తీసుకువెళ్లాడు. శాంతి కృపపై కన్నేసిన అనిల్ గత కొంతకాలంగా ఆమెను అనుసరించడంతో పాటు మాయమాటలు చెప్పి లోబరచుకుంటున్నాడు. దీనిని పసిగట్టిన భార్య దిశ యాప్ ద్వారా భర్త అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది


గుంటూరు జిల్లా తాడేపల్లిలో డిగ్రీ విద్యార్ధిని కిడ్నాప్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శాంతి కృపా అనే 19 ఏళ్ల విద్యార్ధిని విజయవాడ గాంధీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

Also Read:యువతిపై అత్యాచారం, గర్భం దాల్చడంతో.. శీలానికి వెలకట్టి...

Latest Videos

ఈ నేపథ్యంలో తాడేపల్లికి చెందిన అనిల్ అనే రైల్వే ఉద్యోగి యువతిని మాయమాటలతో హోటల్‌కు తీసుకువెళ్లాడు. శాంతి కృపపై కన్నేసిన అనిల్ గత కొంతకాలంగా ఆమెను అనుసరించడంతో పాటు మాయమాటలు చెప్పి లోబరచుకుంటున్నాడు.

దీనిని పసిగట్టిన భార్య దిశ యాప్ ద్వారా భర్త అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హోటల్‌కు చేరుకకుని ఇద్దరిని పట్టుకున్నారు.

Also Read:మైనర్ బాలికను కిడ్నాప్ చేసి... బలవంతంగా పెళ్లి..

విద్యార్దిని కూడా తనని అనిల్ కిడ్నాప్ చేసి.. తన వద్ద ఫోటోలు ఉన్నాయని వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని శాంతి కృపా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్ధిని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

click me!