చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు లక్షలాది రూపాయల టోకరా వేసిన కిలాడీ లేడీ మామిళ్లపల్లి దీప్తిని గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు హైదరాబాదులో అరెస్టు చేశారు.
అమరావతి: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మోసాలకు పాల్పడిన కిలాడీ లేడీ మామిళ్లపల్లి దీప్తిని పోలీసులు అరెస్టు చేశారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడిన ఆమెను గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
హైదరాబాదులో ఆమెను అరెస్టు చేసి పెదకాకానికి తీసుకొచ్చారు. ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కోర్టు 11 రోజుల రిమాండ్ విధించింది. అప్పట్లో సిఎంవోలో పనిచేస్తున్నట్లుగా నకిలీ ఐడీ కార్డులతో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ దీప్తి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
undefined
కాకుమాను మండలం బోడుపాలేనికి చెందిన దీప్తి టీడీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయంలో సందడి చేసేది. మంత్రుల శాఖల కార్యాలయాల్లోకి వెళ్లి వస్తూ నిరుద్యోగులకు నమ్మకం కలిగించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసింది.
ఏపీ జెన్కోలో ఐదుగురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని కడప జిల్లాకు చెందిన వల్లభరెడ్డి రామకృష్ణా రెడ్డితో నిరుడు ఏప్రిల్ 15వ తేదీన ఆమె ఒప్పందం చేసుకుంది. ఇందుకుగాను ఆమె అతని నుంచి రూ.12.50 లక్షలు తీసుకుంది. గుంటూరుకు చెందిన ప్రతిపాటి దిలీప్, మోహనరావు అనేవారు కూడా ఉద్యోగాల కోసం ఆమెకు రూ.6.50 లక్షలు ఇచ్చినట్లు చెబుతున్ారు.
ఆ తర్వాత మోసపోయామని తెలిసి వీరు నిరుడదు అక్టోబర్ 15వ తేదీన పెదకాకాని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ నెల 4వ తేదీన చంద్రబాబు, లోకేష్ హాజరైన కార్యక్రమంలో పాల్గొన్న దీప్తిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఆమె తప్పించుకుని పారిపోయింది.