దాచేపల్లిలో కరోనా టెన్షన్: కోవిడ్ పాజిటివ్ తో వ్యక్తి మృతి

By telugu team  |  First Published Apr 11, 2020, 10:54 AM IST

గుంటూరు జిల్లాలోని దాచేపల్లి ప్రాంతంలో కరోనా వైరస్ పాజిటివ్ తో ఓ వ్యక్తి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో దాచేపల్లి, నడికుడి ప్రాంతాల్లో అధికారులు ప్రజలను అప్రమత్తంచేశారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాచేపల్లి ప్రాంతంలో కరోనా టెన్షన్ చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ తో గుంటూరు జిల్లా దాచెపల్లి ప్రాంతంలోని నారాయణపురంలో ఓ వ్యక్తి మరణించాడు. దీంతో దాచేపల్లి, నడికుడి ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇళ్లలోంచి ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. 

దాచేపల్లి పట్టణం  నారాయణపురం లో నివాసముంటున్న షేక్ నాగుల్ మీరా (51)  ఎలక్ట్రీషియన్. ఇతనికి పది రోజుల నుంచి జ్వరం వస్తోంది.  టెస్ట్  చేయించగా టైఫాయిడ్ అని చెప్పారు  ఆ టెస్ట్ లోనే నెమ్ము కూడా 30 శాతం ఉన్నదని వచ్చింది.  ఫీవర్ తగ్గలేదు . మళ్లీ టెస్ట్ చేయించగా నెమ్ము 60 శాతం వచ్చింది  పిడుగురాళ్ల అభయ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా  గుంటూరు వెళ్ళమని చెప్పారు. 

Latest Videos

గుంటూరు తీసుకువెళ్లి గోరంట్ల లోని ఐడి ఆస్పటల్ నందుఅడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ తొమ్మిదో తేదీ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందాడు. ఇతని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ కి  పంపారు. ఈరోజు ఉదయం అతనికి కరోనా పాజిటివ్ తో చనిపోయినాడని తేలింది  ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉన్నారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా ఐదు కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 82కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కరోనా వైరస్ కేసులు ఈ జిల్లాలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 386కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారంనాడు గత పది గంటల్లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరుకుంది. తాజాగా ఐదు కేసులు నమోదు కావడంతో ఆ సంఖ్య 386కు చేరుకుంది.  

శుక్రవారంనాడు గుంటూరు జిల్లాలో 7, తూర్పు గోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. పది మంది కోలుకున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 82 కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17కు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడిలోని ఉపాధ్యాయుడి నివాసంలో ఇద్దరికి, ఉపాధ్యాయుడి ఇంటి సమీపంలోని ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 370కి పెరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 గంటల్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం తెలిపింది. అనంతపురం జిల్లాలో ఈ రెండు కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 892 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. గురువారంనాడు అనంతపురం జిల్లాలోని మనురేవుకు చెందిన 70 ఏల్ల వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మరణించాడు. గుంటూరులోని ఎన్ఆర్ పేటకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి కూడా మరణించాడు. దీంతో ఏపీలో మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

గురువారంనాడు 363 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ప్రస్తుతం 365కు చేరుకున్నాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 15 కేసులు నమోదయ్యాయి. గురువారంనాడు కొత్తగా ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తూర్పు గోదావరి, కడప జిల్లాలో ఒక్కో కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కు చికిత్స పొంది ఇప్పటి వరకు పది మంది డిశ్చార్జీ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 75 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఏవీ నమోదు కాలేదు.

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసులు ఇవీ...

అనంతపురం 15
చిత్తూరు 20
తూర్పుగోదావరి 17
గుంటూరు 58
కడప 29
కృష్ణా 35
కర్నూలు 82
నెల్లూరు 48
ప్రకాశం 40
విశాఖపట్నం 20
పశ్చిమ గోదావరి 22

click me!