విజయవాడకు చేరుకొన్న చిరంజీవి: కాసేపట్లో జగన్‌తొ భేటీ

Published : Oct 14, 2019, 11:51 AM ISTUpdated : Oct 14, 2019, 01:56 PM IST
విజయవాడకు చేరుకొన్న చిరంజీవి: కాసేపట్లో జగన్‌తొ భేటీ

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి విజయవాడకు చేరుకొన్నారు. సైరా సినిమాను తిలకించాలని జగన్ ను ఆయన కోరనున్నారు.

అమరావతి: సినీ నటుడు చిరంజీవి గన్నవరం విమానాశ్రయం చేరుకొన్నారు. సైరా సినిమా తిలకించాలని ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి సోమవారం నాడు విజయవాడకు వచ్చారు. మరికాసేపట్లో జగన్ తో వీరిద్దరూ భేటీ కానున్నారు.

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డులు సృష్టిస్తోంది. స్వాతంత్ర్య పోరాటంలో సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా  ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను తిలకించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నటుడు,మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఆహ్వానించనున్నారు.ఇందులో భాగంగానే చిరంజీవి సీఎం జగన్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం సీఎం జగన్ తో కలిసి చిరంజీవి లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. సైరా సినిమాను చూడాలని  జగన్ ను చిరంజీవి ఆహ్వానిస్తారు.

వీరిద్దరి భేటీకి రాజకీయంగా కూడ ప్రాధాన్యత ఏర్పడింది అయితే ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత లేదని చిరంజీవి సన్నిహితులు ప్రకటించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి  చిరంజీవి, రామ్‌చరణ్‌లు రోడ్డు మార్గం ద్వారా  అమరావతికి చేరుకొంటారు.


 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా