రాయిటర్స్ సొంత పైత్యమే...: కియా మోటార్స్ తరలింపుపై బొత్స

By Arun Kumar P  |  First Published Feb 7, 2020, 2:53 PM IST

ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు  ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 


అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతిఒక్కరికీ వైసిపి ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్నట్లు పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అంశాలపై తమ ప్రభుత్వంపై  బురదజల్లడానికి  ప్రయత్నించిన టిడిపి నాయకులు మరోసారి పెన్షన్ల పేరుచెప్పి ఆ పని చేయాలని చూస్తున్నారని... వారి  మాటలను ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని మంత్రి తెలిపారు. 

ఇప్పటికే 53 లక్షల 70 వేల 210 మందికి పెన్షన్లు అందించామని వెల్లడించారు. ఇవి కాకుండా 31 వేల 690 ఆరోగ్యపరమైన పెన్షన్లు  కూడా ఇచ్చామన్నారు. కొత్తగా 6 లక్షల మందికి ఇచ్చామన్నారు. 4,16,034 మందిని ఫించన్ పొందేందుకు అనర్హులుగా గుర్తించినట్లు... అయితే వీరిలోనూ పునః పరిశీలన చేసి పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. 
వార్డు వాలంటీర్లు ప్రస్తుతం తనిఖీలో ఉన్నారని... ఈ నెలతో కలిపి వారిలో  అర్హులైన వారికి రెండు నెలల పెన్షన్ ఇస్తామన్నారు. 

Latest Videos

undefined

read more  మహిళల ఆగ్రహం... స్వరూపానంద సరస్వతికి తాకిన రాజధాని సెగ

పెన్షన్ల్ సంఖ్య ను తగ్గించుకోవాలన్న ఆలోచన వైసిపి ప్రభుత్వానికి లేదన్నారు. 300 యూనిట్లు విద్యుత్ వాడుతున్న వారి సంఖ్య 8 వేలు పైచిలుకు వచ్చిందని... వీరి గురించి కూడా పరిశీలన చేస్తున్నామన్నారు. అధికారం కోల్పోయి అసహనంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. 

స్వయంగా కియా సంస్థ ప్రతినిధులు చెప్పినా కియా మోటార్స్ సంస్థ తరలిపోతోందని టిడిపి గగ్గోలు పెట్టడం విడ్డూరంగా వుందన్నారు. దావోస్ పర్యటనలు అంటూ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిన చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్నారన్నారు. 

''వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వెళ్లిపోతారా ఎక్కడయినా. వోక్స్ వేగన్ వ్యవహారంలో అమాయకంగా నమ్మి మోసపోయాను. దానిపై సీబీఐ దర్యాప్తు కూడా వేసుకున్నాం.
 ఎప్పుడైనా చంద్రబాబు ఇలా చేయగలిగారా.రాష్ట్రం అభివృద్ధి చెందకూడదన్న ఆలోచనతో ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు.కియా ఇచ్చిన రిజాయిన్డెర్ రాయిటర్స్ సంస్థ ప్రచురించాలి. ప్రభుత్వ పరంగా మేమెందుకు ఇస్తాం. వారు మమ్మల్ని సంప్రదించలేదు'' అని బొత్స వివరించారు. 

click me!