ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మొదటి మహిళా సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ కలెక్టర్లతో జరిగిన మొదటి సమావేశంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలకు లబ్దిదారుల ఎంపికకై నవంబరు 20 నుండి డిసెంబర్ 20 వరకూ నెల రోజులు పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు నూతన చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ వెల్లడించారు. వైఎస్సార్ నవశకం పేరుతో దీన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించిన ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
గ్రామ,వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే క్యాంపెయిన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు... ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను సాట్యురేషన్ పద్ధతిలో గుర్తించి ఎంపిక చేసేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ ఉపయోగపడుతుందన్నారు.
ముఖ్యంగా నూతన బియ్యం కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కార్డుల పంపిణీకి లబ్దిదారుల గుర్తింపునకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
video news : తిరిగి రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉంది
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలైన వైఎస్సార్ మత్స్య కార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, అమ్మ వడి, టైలర్లు,రజకులు,నాయీ బ్రాహ్మణుల షాపులు, వైఎస్సార్ కాపునేస్తం, ఇమామ్స్,మౌజంలు, పాస్టర్లు, అర్చకులకు సంబంధించిన లబ్దిదారుల గుర్తించేందుకు ఈ క్యాంపెయిన్ ను ఉపయోగించుకోవాలని సీఎస్ సూచించారు.
read more ఏపీ సీఎస్ గా నీలం సహాని బాధ్యతలు.. వారిద్దరి తర్వాత ఆమెదెే రికార్డు
సీఎస్ మొదటిసారి చేపట్టిన ఈ వీడియో సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన పథకాలకు లబ్దిదారుల గుర్తింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా శాఖల కార్యదర్శులు వివరించారు. ఈ వీడియో సమావేశంలో సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు,ఇతర అధికారులు పాల్గొన్నారు.