నిరుద్యోగ యువతకు చేయూత...సింగపూర్ సాయం...: మంత్రి సురేష్

By Arun Kumar PFirst Published Oct 16, 2019, 7:42 PM IST
Highlights

తాడేపల్లి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సింగపూర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల్లో సింగపూర్ సహకారాన్ని కోరినట్లు తెలుస్తోంది. 

అమరావతి:   విద్య మరియు ఉపాధి అంశాలపై సింగపూర్ ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. వెలగపూడి సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో  సమావేశం జరిగింది. ఇందులె సింగపూర్ ప్రతినిధులతో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపట్టిన వివిధ చర్యలు, భవిష్యత్ ప్రణాళికల గురించి సింగపూర్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా  చేపడుతున్న''నాడు - నేడు'' కార్యక్రమం గురించి మంత్రి వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల మౌళిక వసతుల కల్పనకు చేపట్టబోతున్న చర్యల గురించి సవివరంగా వివరించారు. భవిష్యతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నట్లు మంత్రి తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై  కూడా చర్చించారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణ పరిశ్రమల్లో ఉపాధి పొందడం, మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్య అభివృద్ధి కోసం సింగపూర్ సహకారం అవసరమని మంత్రి కోరారు. దీర్ఘకాలిక భాగస్వామ్యంపై మంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.  

ఈ సమావేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్ జాయింట్ సెక్రటరీ కే. బిస్వాల్ కూడా పాల్గొన్నారు. ఆయన కూడా రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యా వ్యవస్థ, ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. 

click me!